'కేడి బిల్లా - కిలాడి రంగా' ట్రైలర్ లాంచ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
భీమవరం టాకీస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తాజాగా అందిస్తున్న అనువాద చిత్రం "కేడి బిల్లా-కిలాడీ రంగా". "పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రెజీనా-బిండుమాధవి హీరోయిన్లుగా, విమల్-శివకార్తికేయన్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. మే 13న విడుదల కానున్న ఈ చితరం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసారు.
ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ "కేడి బిల్లా.. కిలాడి రంగా" ట్రైలర్ ను విడుదల చేసి.. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని అభిలషించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, భద్రకాళి ఫిల్మ్స్ అధినేత ప్రసాద్, బాలాజీ నాగలింగం, ఎన్.ఎస్.ఆర్ ఫిల్మ్స్ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.సత్యనారాయణ, డైలాగ్ రైటర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. "కేడి బిల్లా-కిలాడీ రంగా" తప్పకుండా ఘన విజయ సాధించాలని వారంతా ఆకాక్షించారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "రెజీనా, బిందుమాధవిల గ్లామర్- విమల్, శివకార్తికేయన్‌ల పెర్‌ఫార్మెన్స్ - యువన్ శంకర్‌రాజా సంగీతం "కేడి బిల్లా-కిలాడి రంగా" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. "పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ "కేడి బిల్లా-కిలాడీ రంగా" చిత్రాన్నిఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. త్వరలో ఆడియో రిలీజ్ చేసి, మే 13న సినిమాను విడుదల చేయనున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com