'కేడి బిల్లా - కిలాడి రంగా' డబ్బింగ్ కార్యక్రమాలకు శ్రీకారం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ తమిళ దర్శకుడు పాండిరాజ్ (పసంగ ఫేం) దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ చిత్రం కేడి బిల్లా-కిలాడి రంగా` అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మల్స్పల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రంలో విమల్, శివకార్తికేయన్ హీరోలు కాగా.. రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు. యువన్ శంకర్‌రాజా సంగీత సారధ్యం వహించారు. విజయదశమి పర్వదినాన కేడి బిల్లా-కిలాడి రంగా` డబ్బింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. తమిళంలో సంచన విజయాలతో దూసుకుపోతున్న పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన కేడి బిల్లా-కిలాడి రంగా` చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఆడియో విడుద చేసి, నవంబర్ చివరివారంలో లేదా.. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం` అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, మ్యూజిక్ అండ్ సౌండ్ సూపర్విజన్: శేషు కె.యం.ఆర్, మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.సత్యనారాయణ, సంగీతం: యువన్ శంకర్‌రాజా, నిర్మాత: తుమ్మపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: పాండిరాజ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments