కేసీఆర్-వైఎస్ జగన్ ఏం చర్చించారు!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో భేటి అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు ప్రధాన విభాగాల అధికారులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై నిశితంగా చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
చర్చకొచ్చిన అంశాలివేనా!?
విభజన చట్టంలోని పలు అంశాలు
జల వనరుల సద్వినియోగం..
9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకాలు
ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులపై చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇంతవరకూ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
ఘన స్వాగతం!
కాగా.. సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్‌కు సీఎం జగన్ చేరుకోగా.. స్వయంగా గులాబీ బాస్ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం వీరిద్దరి భేటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) తరపున ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు వైఎస్ జగన్ అందజేశారు. కుటుంబ సమేతంగా ఈనెల 28 నుంచి జరగనున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. కాగా.. ఈ భేటీలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు సీఎం జగన్ వెంట ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments