కేసీఆర్-వైఎస్ జగన్ ఏం చర్చించారు!?

  • IndiaGlitz, [Monday,September 23 2019]

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌లు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు ప్రధాన విభాగాల అధికారులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై నిశితంగా చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

చర్చకొచ్చిన అంశాలివేనా!?

విభజన చట్టంలోని పలు అంశాలు

జల వనరుల సద్వినియోగం..

9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకాలు

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులపై చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇంతవరకూ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

ఘన స్వాగతం!
కాగా.. సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసమైన ప్రగతి భవన్‌కు సీఎం జగన్‌ చేరుకోగా.. స్వయంగా గులాబీ బాస్ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం వీరిద్దరి భేటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) తరపున ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు వైఎస్ జగన్‌ అందజేశారు. కుటుంబ సమేతంగా ఈనెల 28 నుంచి జరగనున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. కాగా.. ఈ భేటీలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు సీఎం జగన్‌ వెంట ఉన్నారు.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`

ఎప్పుడెప్పుడా అని ఆతృత‌గా మెగాభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`.

కుప్పకూలిన ‘థామస్‌కుక్‌’.. నో చెప్పిన బ్రిటన్ సర్కార్!

బ్రిటిష్‌ పర్యాటక సంస్థ ‘థామస్‌కుక్‌’ ఒక్కసారిగా కుప్పకూలింది. పది, పదిహేను కాదు.. ఏకంగా 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాలా ప్రకటించడం పెద్ద షాకింగ్ న్యూసే.

మగబిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్

అందాల తార అమీ జాక్సన్.. పెళ్లి కాకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

మౌనిక ఫ్యామిలీకి రూ. 20 లక్షలు.. ఒకరికి ఉద్యోగం!

హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్ పెచ్చులూడిపడి మౌనిక అనే మహిళ చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

రసూల్ పురా ‘మెట్రో’ పైకప్పు పెచ్చులూడిందా!

హైదరాబాద్‌లోని అమీర్ పేట మెట్రో రైల్వేస్టేషన్ ఆవరణలో పైకప్పు పెచ్చులూడిన ఘటనలో మౌనిక అనే మహిళ మృతి చెందిన అనంతరం అన్నీ అనుమానాలే వెల్లువెత్తుతున్నాయి.