బీజేపీకి బ్రేక్‌లు వేయడానికి  ‘ఇద్దరు మిత్రులు’ భారీ ప్లాన్!

  • IndiaGlitz, [Sunday,August 04 2019]

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి బ్రేక్‌లు వేయడానికి ఇద్దరు మిత్రులు భారీ ప్లాన్ గీశారా..? సైలెంట్‌గా ఆ ప్లాన్ వర్కవుట్ చేయాలని కేసీఆర్, జగన్ భావిస్తున్నారా..? జగన్ విదేశాల నుంచి తిరిగి రాగానే యాక్షన్ ప్లాన్‌లో దిగుతారా..? బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాడనికి ఇద్దరు సీఎంలు డిసైడ్ అయ్యారా..? అంటే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనిపిస్తోంది. అయితే ఇద్దరు మిత్రుల ప్లానేంటి..? ఇద్దరు మిత్రులు ఏం చేయబోతున్నారు..? అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించిన దాఖలాలు లేవనే చెప్పుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీతో పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చాలా సఖ్యతగానే ముందుకెళ్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలి.. 2024 కల్లా తెలంగాణ లేదా ఏపీని కైవసం చేసుకోవాలని కమలనాథులు భారీ ప్లాన్‌తోనే ఉన్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ కమల’ను ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సిట్టింగ్‌లు, మాజీలు కాషాయ కండువా కప్పేసుకున్నారు.

రివర్స్ ఎటాక్ లేదుగా..!

అయితే.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలపై అటు ఏపీ కమలనాథులు.. ఇటు తెలంగాణ కమలనాథులు మధ్యలో కేంద్ర కమలనాథులు పెద్ద ఎత్తునే అటాక్ చేస్తున్నారు. కొందరైతే విచక్షణ మరిచి మరీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇటు కేసీఆర్ కానీ.. అటు జగన్ కానీ.. రివర్స్ అటాక్ చేయనేలేదు. ఇందుకు కారణాలేంటి..? దీనివెనుక వ్యూహం ఏమైనా ఉందా అనేది మాత్రం ఆ ఇద్దరికే ఎరుక. అంతేకాదు చాలా తెలివిగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు, నేతలు ఎవరూ నోరు మెదపట్లేదు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు సేమ్ సీన్‌ ఫాలో అవుతున్నారు.

భారీ ప్లాన్ రెడీనా!

ఇవన్నీ ఓ ఎత్తయితే ఇటీవల వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందు కేసీఆర్‌తో భేటీ అయిన విషయం విదితమే. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కళ్లెం వేయాలనే దానిపై నిశితంగా చర్చించారని టీవీ, వార్తా పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి ఈ ఇద్దరూ భారీ ప్లాన్‌తోనే ఉన్నారని లీకులు వస్తున్నాయి. అయితే ఆ భారీ ప్లాన్ ఏంటి..? ఇద్దరు మిత్రులు కలిసి ఏం చేయబోతున్నారు..? ఈ ఇద్దరూ తలుచుకుంటే కమలనాథులను అడ్డుకుంటారా..? అసలు అది జరిగే పనేనా..? ఎలా అడ్డుకుంటారో..? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే తమ పార్టీ బలోపేతం కాకుండా తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తారో చూద్దాం అంటూ కమలనాథులు మీడియా ముందుకొచ్చి ఔట్లు పేలుస్తున్నారు. అయితే వైఎస్ జగన్ విదేశాల నుంచి రాగానే యాక్షన్ ప్లాన్‌లోకి దిగుతారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఇద్దరు మిత్రులు బీజేపీకి బ్రేక్‌లు వేయడానికి గట్టి ప్లాన్ వేసినట్లు సమాచారం.

ఇద్దరి గుట్టు కేంద్రం చేతిలో!

ఇదిలా ఉంటే.. వీరిద్దరూ మౌనంగా ఉండటానికి ఇరువురిపై ఉన్న కేసులేనని బీజేపీ నేతలు బహిరంగంగానే తిట్టిపోస్తున్నారు. ఇద్దరిపై ఉన్న కేసులన్నీ కచ్చితంగా విచారణ జరుగుతాయని పెద్ద ఎత్తునే విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్‌పై సీబీఐ కేసులు.. కేసీఆర్‌పై సహారా కేసులున్న విషయం విదితమే. ఈ ఇద్దరిపై ఎప్పట్నుంచో కేసులు నడుస్తూనే ఉన్నాయ్ కానీ.. ఇంతవరకూ కొలిక్కిరాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇద్దరు మిత్రుల గుట్టు కేంద్రం చేతిలో ఉన్నట్లే.! అయితే వీటినే అదనుగా చూసుకుని కేంద్రం ఓ బంతాట ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా కమలం వికసించి తీరాల్సిందే.. ఇందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని అంటున్న కమలనాథులు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావడానికి ఏమేం ప్రయోగాలు చేస్తారో..? వారిని తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ మాత్రం అడ్డుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

తెలుగు తమ్ముళ్లూ.. జనం ఛీ కొట్టినా మారరా!

జనం ఛీకొట్టినా తెలుగు తమ్ముళ్లలో మార్పురావడం లేదని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

పీసీసీ చీఫ్‌గా రఘువీరా ఔట్.. ‘పళ్లం’కు పగ్గాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే.

రియల్ హీరో అనిపించుకున్న ‘రేసుగుర్రం’ విలన్!

ఇండియాలో చాలా చిత్రవిచిత్రమైన రాజకీయ నేతలను మనం చూసే ఉంటాం.. కనీసం వార్తల్లో అయినా ఫలానా నేత ఇలా చేశారు..

పునర్నవీని డేట్‌కు పిలిచిన రాహుల్.. రియాక్షన్ ఇదీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.

తీన్మార్ సావిత్రి ప్రేమ కథ.. కన్నీటి ప్రవాహమే!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.