కేసీఆర్ సక్సెస్ అవుతారు.. కేంద్రంలో బీజేపీ గెలవదు!

  • IndiaGlitz, [Monday,May 06 2019]

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని సినీ నటుడు, ఎంపీ అభ్యర్థి ప్రకాష్ రాజ్ జోస్యం చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బెంగళూరు సెంట్రల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చానని.. గెలిచే అవకాశాలు తనకు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు, బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే చాన్స్ లేదని.. కచ్చితంగా కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఒక్క పార్టీకే మెజార్టీ వస్తే ఏం జరిగిందో గత ఎన్నికల్లో అందరూ చూశారన్నారు. మనది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అని ఈ సందర్భంగా ప్రకాష్ గుర్తు చేశారు.

ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు హవా నడుస్తోందన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తాను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. విద్యా, వైద్య రంగంలో దేశానికి ఆదర్శప్రాయంగా ఆప్ పని చేసిందని ప్రకాష్ కొనియాడారు. పని చేసిన వ్యక్తులను చూసే ప్రజలు ఓటేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో ప్రకాష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధ్విలాంటి వాళ్లు పార్లమెంట్ కెళ్ళి ఎలాంటి చట్టాలు చేస్తారని మండిపడ్డారు.

More News

వల్లభనేని వంశీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చిన యార్లగడ్డ

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు

బాల‌కృష్ణ 105వ సినిమా వివరాలు

బాల‌కృష్ణ 105వ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డింది. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ

డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ బుర్ర‌క‌థ‌

ఆది సాయికుమార్, మిస్తి చ‌క్ర‌వ‌ర్తి జంట‌గా న‌టిస్తున్న చిత్రం బుర్ర‌క‌థ‌. పిల్లా  నువ్వులేని జీవితం, ఈడో ర‌కం, ఆడో ర‌కం సినిమాల‌తో ర‌చ‌యిత‌గా పెద్ద విజ‌యాల్ని అందుకున్న డైమండ్ ర‌త్న‌బాబు

నటి సురేఖ వాణి భర్త కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. నటి సురేఖ వాణి భర్త, టీవీషోల దర్శకుడు సురేశ్ తేజ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ సోమవారం కన్నుమూశారు.

'ఏదైనా జరగొచ్చు' ఆడియో విడుదల 

ప్రముఖ నటుడు శివాజీరాజా కొడుకు విజయ్‌రాజాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ కె.రమాకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. బాబీసింహా విల‌న్ గా న‌టిస్తున్నారు.