కేసీఆర్ సక్సెస్ అవుతారు.. కేంద్రంలో బీజేపీ గెలవదు!
Send us your feedback to audioarticles@vaarta.com
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని సినీ నటుడు, ఎంపీ అభ్యర్థి ప్రకాష్ రాజ్ జోస్యం చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బెంగళూరు సెంట్రల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చానని.. గెలిచే అవకాశాలు తనకు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు, బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే చాన్స్ లేదని.. కచ్చితంగా కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఒక్క పార్టీకే మెజార్టీ వస్తే ఏం జరిగిందో గత ఎన్నికల్లో అందరూ చూశారన్నారు. మనది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అని ఈ సందర్భంగా ప్రకాష్ గుర్తు చేశారు.
ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు హవా నడుస్తోందన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తాను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. విద్యా, వైద్య రంగంలో దేశానికి ఆదర్శప్రాయంగా ఆప్ పని చేసిందని ప్రకాష్ కొనియాడారు. పని చేసిన వ్యక్తులను చూసే ప్రజలు ఓటేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో ప్రకాష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధ్విలాంటి వాళ్లు పార్లమెంట్ కెళ్ళి ఎలాంటి చట్టాలు చేస్తారని మండిపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments