KCR:కాసేపట్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోంది. వారం రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నారు. ఈ మేరకు వైద్యులు ప్రకటించారు. డిశ్చార్జ్ అనంతరం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి ఆయన వెళ్లనున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పడంతో ఆయన అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని శుభ్రం చేస్తూ ఆయన వైద్యానికి తగ్గట్లు చకాచకా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ నొప్పి మాత్రమే ఉందని.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. అయితే కొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందన్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని ఆకాంక్షించారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. సీతక్క, పొన్నం ప్రభాకర్ తదిరత నేతలు కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు. అలాగే సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా గులాబీ అధినేతను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
కాగా డిసెంబర్ 7న ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నివాసంలో కేసీఆర్ కాలు జారి కింద పడ్డారు. ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకోగానే పరీక్షలు నిర్వహించిన వైద్యులు తుంటి ఎముక విరిగిందని గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి హిప్ బోన్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం వాకర్ సాయంతో కొద్ది దూరం నడిపించారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout