KCR:97 నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటనలు.. నేటితో ముగింపు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీ ప్రచారమంతా తన భుజస్కందాలపై వేసుకుని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అక్టోబర్ 15న మొదలైన కేసీఆర్ ప్రచారపర్వం.. నేటి సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటివరకు 97 సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్రచారం చివరి రోజైన ఇవాళ రెండు సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్సభతో ప్రచారం ముగిస్తారు.
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు..
ముఖ్యంగా తన సభల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరెంట్ కోతలు, రైతుబంధు, ధరణిని ప్రధాన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24గంటల కరెంట్ ఉండదని పదే పదే తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందంటున్నారని.. అలాగే టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దండగ అన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఇక కాంగ్రెస్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారని అదే జరిగితే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందని హెచ్చరించారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఇచ్చేలా పోరాటం చేశాం..
తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు తనదైన శైలిలిలో కౌంటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని ఇచ్చేలా తాము పోరాడామని గుర్తుచేశారు. 2004లోనే తెలంగాణ ఉచ్చుంటే.. వందలాది మంది బలిదానాలు చేసుకునేవారు కాదని మండిపడ్డారు. 1956లో తెలంగాణలో ఆంధ్రాతో కలిపి తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఇదంతాకాదు కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టిన తర్వాత తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. ఇలా తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments