పీపీఈ కిట్ లేకుండా గాంధీ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకోకుండా కేవలం మాస్కు పెట్టుకుని వెళ్లి గాంధీలోని కరోనా రోగులను పరామర్శించారు.
ఏమాత్రం అదురు లేదు బెదురు లేకుండా నేరుగా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న దాదాపు 40 మంది కరోనా రోగులని పలకరించి వారికి మనోదైర్యానిచ్చారు. కరోనా రోగులకు ధైర్యం చెప్పడమే కాకుండా.. వైద్యులను కేసీఆర్ అభినందించారు. అనంతరం కరోనా రోగులకు అందుతున్న సేవలను కేసీఆర్ పరిశీలించారు.
ఇదీ చదవండి: బిడ్డా గంగుల మాడి మసైపోతారు: ఈటల.. వెంట్రుక కూడా పీకలేవు: గంగుల
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి చర్చించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణాన్ని మొత్తం శానిటైజ్ చేశారు.
పోలీసులతో పేషెంట్ల బంధువులు వాగ్వాదం..
సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించడానికి ముందు నుంచే ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు కఠినం చేశారు. ఈ నేపథ్యంలో పేషెంట్ల తాలుకూ సహాయకులను పోలీసులు బయటకు పంపించి వేశారు. ఈ సమయంలో కాసేపు గాంధీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో కరోనా పేషంట్ బంధువులు వాగ్వాదానికి దిగారు. డెడ్ బాడీలను సైతం తీసుకు వెళ్ళేందుకు వెళుతున్న తమను ఆస్పత్రి లోపలికి అనుమతి ఇవ్వడం లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీ పరిసరాల్లో రెండు కిలో మీటర్ల మేర ఎవ్వరూ రాకుండా ఆంక్షలు విధించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments