మాజీ హోంమంత్రి నాయినిని పరామర్శించిన కేసీఆర్..
- IndiaGlitz, [Wednesday,October 21 2020]
మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి నాయినిని చూసేందుకు సీఎం కేసీఆర్ వెళ్లారు. అనంతరం వైద్యులతో మాట్లాడి నాయిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిమోనియాతో బాధపడుతున్న నాయినికి వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. సెప్టెంబర్ 28న నాయినికి కరోనా పాజిటివ్ వచ్చింది.
బంజారాహిల్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆయనకు నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లి పోయారు. ఆరోగ్యం కుదుటపడిందని ఆనందించే లోపే ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. ఈ క్రమంలోనే ఆయన మరోమారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. కాగా.. నేడు సీఎం కేసీఆర్ వెళ్లి నాయినిని పరామర్శించారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు