ఈరోజు మధ్యాహ్నం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ని వీక్షించనున్న కె.సి.ఆర్
Thursday, January 12, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుజాతి ఖ్యాతిని చాటి చెప్పిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితగాథ బాలకృష్ణ హీరోగా తెరకెక్కింన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్ రిలీజైంది. మంచి టాక్‌తో ముందుకెళుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. తెలుగు జాతి గొప్పతనాన్ని చెప్పే చిత్రం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరికింది.
ముఖ్యంగా ఈ సినిమా ఓపెనింగ్ రోజునే తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తాను తొలిరోజునే సినిమాను చూడాలనుకుంటున్నానని చెప్పారు. అన్నమాట ప్రకారమే కె.సి.ఆర్ ఈ రోజు అంటే జనవరి 12 మధ్యాహ్నం ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో సినిమాను చూస్తున్నారు. బాలకృష్ణతో పాటు మొత్తం చిత్రయూనిట్ కూడా ఈ షోకు హాజరు కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments