టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. చెన్నైకి కేసీఆర్ పయనం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో సార్వత్రిక, పంచాయితీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మే-14న నామినేషన్ దాఖలు చివరి రోజు కాగా.. ఈ నెల 31న ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో గత వారం రోజులుగా అటు కాంగ్రెస్.. ఇటు టీఆర్ఎస్.. బీజేపీ పార్టీల అధినేతలు అభ్యర్థుల కసరత్తు ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అందరికంటే ముందుగానే ప్రకటించిన గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు.
అభ్యర్థులు ఖరారు..!
రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. అంతేకాదు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వారికి తన చేతుల మీదుగానే బీఫామ్‌లను కూడా అందజేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా తుదిమెరుగులు దిద్దుతూనే ఉంది.
చెన్నైకి పయనం.. స్టాలిన్‌తో భేటీ!
కాగా.. అభ్యర్థులకు బీ-ఫామ్ అందజేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నైకి పయనమై వెళ్లారు. సోమవారం ఉదయం ముందుగా అనుకున్నట్లుగానే మే-13 తారీఖున డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. భేటీలో భాగంగా కేసీఆర్- స్టాలిన్‌ల మధ్య ఫెడరల్ ఫ్రంట్ విషయమై చర్చించనున్నారు. కాగా.. కేసీఆర్ అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్‌లు కాకుండా థర్డ్ ఫ్రంట్ అంటూ ఇప్పటికే రాష్ట్రాల బాట పట్టి పలు పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల సీఎంలను కలిసిన విషయం విదితమే. అయితే కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్న స్టాలిన్.. రేపొద్దున భేటీ అనంతరం ఎలా రియాక్ట్ అవుతారో..? వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com