సి.ఎం కె.సి.ఆర్ కు బాలయ్య ఆహ్వానం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ సి.ఎం క్యాంపు కార్యాలయంలో కలిసారు. తన వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవంకు కె.సి.ఆర్ ను ఆహ్వానించారు. ఉగాది రోజున అమరావతిలో బాలయ్య ఈ చిత్రం గురించి ఎనౌన్స్ చేసారు.
ఈ భారీ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెల 22న ప్రారంభించనున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సం ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగే ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com