ఇంటర్ బోర్డు ఎత్తివేసే యోచనలో కేసీఆర్!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన రివ్యూ మీటింగ్ కు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమారులతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలపై చర్చించిన ఆయన.... ఇంటర్ బోర్డు వ్యవహారంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఇంటర్ బోర్డును ఎత్తి వేస్తూ.... టెన్త్ తో పాటు పదకొండు, పన్నెండు తరగతులకు కూడా ఒకే బోర్డును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా... ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఫ్రీ రీ వాల్యుయేషన్,రీ కౌంటింగ్ చేయించాలని సూచించారు. అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా.... ఫెయిల్ అయిన మూడు లక్షలకు పైగా విద్యార్థులకు వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డికి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. విద్యార్థుల ఆత్మహత్యలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్.... ఇంటర్ లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని... ఆత్మహత్యలు చేసుకోరాదని విద్యార్థులకు సూచించారు. ఇంటర్ తో పాటు ప్రవేశార్హత పరీక్షల్లోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని... పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments