ఇంటర్ బోర్డు ఎత్తివేసే యోచనలో కేసీఆర్!!

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన రివ్యూ మీటింగ్ కు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమారులతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలపై చర్చించిన ఆయన.... ఇంటర్ బోర్డు వ్యవహారంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఇంటర్ బోర్డును ఎత్తి వేస్తూ.... టెన్త్ తో పాటు పదకొండు, పన్నెండు తరగతులకు కూడా ఒకే బోర్డును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా... ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఫ్రీ రీ వాల్యుయేషన్,రీ కౌంటింగ్ చేయించాలని సూచించారు. అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా.... ఫెయిల్ అయిన మూడు లక్షలకు పైగా విద్యార్థులకు వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డికి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. విద్యార్థుల ఆత్మహత్యలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్.... ఇంటర్ లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని... ఆత్మహత్యలు చేసుకోరాదని విద్యార్థులకు సూచించారు. ఇంటర్ తో పాటు ప్రవేశార్హత పరీక్షల్లోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని... పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

More News

తారకరత్న కథానాయకుడిగా దేవినేని నెహ్రూ బయోపిక్ ప్రారంభం 

నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ గా నటిస్తున్నారు. "దేవినేని"  టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్ తో రూపొందుతోన్న ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

వైసీపీలో చేరాలని లక్ష్మీ నారాయణకు ఆహ్వానం

అవును మీరు వింటున్నది నిజమే.. ఈ విషయం స్వయానా సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణే స్వయానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మోదీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్

''నేను ప్రధాన మంత్రి అవుతానని అసలు ఊహించలేదు. ప్రధాని కావాలని నేనెప్పుడూ కలగనలేదు. కుటుంబ ప్రమేయంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను.

జగన్‌ లక్ష కోట్ల వ్యవహారం.. అసలు విషయం చెప్పిన మాజీ జేడీ

"లక్ష కోట్లు.. లక్ష కోట్లు.. వైఎస్ జగన్ లక్ష కోట్లు దోచుకున్నారు.. జగన్ రాజకీయాలకు అర్హుడు కాదు.. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని దొరికినదంతా దోచుకున్నాడు" అని అధికార పార్టీకి చెందిన నేతలు

సచిన్‌‌కు వెరైటీగా బర్త్ ‌డే విషెస్ చెప్పిన రామ్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌ పుట్టిన రోజు నేడు. నేటితో ఆయన 46వ పడిలోకి అడుగుపెడుతున్నారు.