కడప జిల్లాలో కేసీఆర్ ఎన్నికల సర్వే..!?

  • IndiaGlitz, [Wednesday,January 30 2019]

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల సర్వే నిర్వహించారా..? సర్వే నిర్వహించాల్సిన అవసరం ఆయనకేంటి..? సర్వే చేయడం వెనుక ఆంతర్యమేంటి..? సర్వేలో ఏం తేలాయి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేంటి ఈ సర్వే..!

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలంగాణకు సంబంధించిన ఒక బృందం సర్వే చేపట్టింది. నియోజకవర్గంలో ఆరు ప్రశ్నలతో కూడిన సర్వే నిర్వహించింది. అయితే ఈ మధ్య ఓట్లు తొలగించడానికి ఏపీలో అక్కడక్కడా బూచోళ్లు తిరుగున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ బూచోళ్లే ప్రొద్దుటూరుకు వచ్చారేమో అని పట్టణంలోని ఒకటవ వార్డులో సర్వే బృందాన్ని ఒక్కసారిగా జనాలంతా చుట్టుముట్టారు. సర్వే బృందంపై జనాలు ప్రశ్నలు వర్షం కురిపియడంతో వారి నుంచి సమాధానాలు రావట్లేదు. ఈ ప్రశ్నలకు కంగుతిన్న బృందం ఎక్కడ తమ మీద అటాక్ చేస్తారోనని భయపడి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. 40మంది బృందం నుంచి ఐడీ కార్డులు తీసుకొని విచారించగా వీరింతా జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్శిటీల నుంచి.. సోషియల్‌ పోస్ట్‌ ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ సంస్థకు సంబందించినవారని తేలింది.

2014 ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూడా తనకే టికెట్ అని... ఖచ్చితంగా గెలుస్తానని రాచమల్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ వస్తుందా రాదా అన్నది పైనున్న దేవుడికెరుక. ఇదే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు కొందరు ఎన్నికల ముందు వైసీపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి పేరును సైతం సర్వేలో అడగటం గమనార్హం.

ఇదిగో ప్రశ్నలివే..
వైసీపీ టిక్కెట్టు ఎవరికిస్తే బాగుంటుంది

ఎ) రాచమల్లు ప్రసాద్‌రెడ్డి (బి) వరదరాజులరెడ్డి (సి) ఇతరులు

టీడీపీ టికెట్టు ఎవరికిస్తే బాగుంటుంది
ఎ)లింగారెడ్డి (బి) వరదరాజులరెడ్డి (సి) సీఎం రమేష్‌

టీడీపీ ప్రభుత్వంలో పథకాలు మీకు అందాయా
ఎ) అవును (బి) కాదు

వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా
ఎ) అవును (బి) లేదు

టీడీపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారా
ఎ) అవును (బి) లేదు

ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది
ఎ) వైసీపీ (బి) టీడీపీ (సి) జనసేన (డి) బీజేపీ

ఈ సందర్భంగా సర్వేకు బృందానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. మాకు ఏపార్టీతో సంబంధం లేదని.. ఇక్కడి నాయకులు కూడా ఎవరు తెలియదని.. అన్ని రకాల అనుమతులతోనే ఈసర్వే నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సర్వే చేసుకునే హక్కు ఉందిని జిల్లాకు చెందిన డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే.. తెలంగాణకు చెందిన సర్వే బృందం కడప జిల్లాతో ప్రారంభమై అన్నిజిల్లాల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేను కేసీఆరే చేయిస్తున్నట్లు సమాచారం. ఏపీ ఎన్నికల్లో వేలు పెడతానన్న గులాబీ బాస్ కొంతమంది విద్యార్థులను ఓ బృందంగా ఏర్పాటు చేసి ఇలా సర్వే చేయిస్తు్న్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ వ్యవహారం ఎంత వరకు నిజం..? అసలు దీనివెనుక ఎవరున్నారు..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే మరి.

More News

హీరోయిన్ల పై సింగర్ ఎస్పీ బాలు బోల్డ్ కామెంట్స్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్స్‌‌పై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు విన్న సినీ ప్రియులు, నటీనటులు సైతం ఒకింత అవాక్కయ్యారు.

రాజ్‌త‌రుణ్‌ దగ్గరకి మహేష్ మేనల్లుడి కథ...

ప్రతి మెతుకు మీదా తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందని తెలుగులో సామెత. అలాగే, ప్రతి కథ మీదా ఎవరు నటించాలో రాసి భగవంతుడు రాసి పెడతాడు అనుకోవాలి.

'4 లెటర్స్‌' ఆడియో!

ఈశ్వర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చక్ర క్రియేషన్స్‌ పతాకంపై దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించిన సినిమా ‘4 లెటర్స్‌’.

నాకు పౌరుషం వచ్చింది.. ఆధారాలు బయటపెడతా!

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిదే గెలుపు అంటూ సర్వేలో తేల్చిన ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. అదికాస్త సీన్ రివర్స్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు.

వెంక‌టేశ్ ప‌క్క‌న శ్రియ క‌న్ఫ‌ర్మ్‌!

మామాఅల్లుళ్లు 'విక్టరీ' వెంకటేష్, 'యువ సామ్రాట్' అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించనున్న సినిమా 'వెంకీ మామ'.