స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ కష్టమే.. బ్రేక్‌లు ఎందుకు పడ్డాయ్!?
- IndiaGlitz, [Tuesday,May 07 2019]
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మరోసారి ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అవుతూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు పలు పార్టీల అధినేతలను కలవడం, తెలంగాణ రప్పించి చర్చలు జరపడం లాంటివి చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండగా మరోసారి కేసీఆర్ తన ప్రయత్నాలు ప్రారంభించారు.
సోమవారం అనగా తన లక్కీ నంబర్ అయిన 06 నుంచి కేసీఆర్ రాష్ట్రాల బాట పట్టారు. ఇందులో భాగంగా మొదట కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. కేంద్రంలో అటు కాంగ్రెస్, బీజేపీలకు మెజార్టీ రాదని.. కచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా అని.. విజయన్‌కు కేసీఆర్ నిశితంగా వివరించారు. అంతేకాదు ఇప్పటికే ఎవరెవ్ని కలవాలి..? ఏయే రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలి..? ఏ పార్టీ అధినేతలను కలవాలి అని అపాయింట్‌మెంట్స్‌కు కూడా కేసీఆర్ తీసుకున్నారు.
అసలు కారణం ఇదేనా..?
కాగా.. ఈ నెల 13న ఆయన డీఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌తో తమిళనాడులో భేటీ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ భేటీపై ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు కూడా. అయితే తాజా సమాచారం ప్రకారం.. కేసీఆర్‌తో స్టాలిన్ భేటీ ఉండకపోవచ్చునని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో ఈ నెల 19న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాలిన్.. ప్రత్యర్థ పార్టీలకు తన సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్నారు. తండ్రి మరణాంతరం ఫస్ట్ టైమ్ ఎన్నికలకు వెళ్తున్న స్టాలిన్ ప్రత్యర్థ పార్టీలను దెబ్బ తీయాలని ప్లాన్ వేశారు. అంతే అన్నాడీఎంకే ఒకరిలోఒకరు గొడవలుండటంతో ఫైనల్ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్‌గా భావించి బిజిబిజీగా ప్రచారం చేస్తున్నారు.
కుదరదా.. లేకుంటే అనుమానమా..!?
ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న స్టాలిన్ ప్రస్తుతం కేసీఆర్‌తో భేటీ అయ్యి చర్చించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. దీంతో భేటీ 13న ఉండటం కష్టమేనని స్పష్టమవుతోంది. ఎన్నికల తర్వాత భేటీ అవుదామని ఇప్పటికే స్టాలిన్ నుంచి కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టాలిన్ కాంగ్రెస్‌తో కలిసే అడుగేలుస్తున్న విషయం విదితమే. దీంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ కూటమి కడుతుండటంతో స్టాలిన్-కేసీఆర్ భేటీకి హస్తం అధిష్టానం బ్రేక్‌లు వేసిందని తెలుస్తోంది. సో.. మొత్తానికి చూస్తే ఎన్నికల తర్వాత కాదు కదా.. అసలే భేటీ లేనట్లేనని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ వ్యవహారంపై కేసీఆర్ అటు డీఎంకే వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.