హుజూర్‌నగర్‌పై కేసీఆర్ వరాల వర్షం... తెలంగాణలో ఏ ఇంచైనా నాదే!
Send us your feedback to audioarticles@vaarta.com
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని రీతిలో మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్.. నియోజకవర్గంపై వరాల వర్షం కురిపించారు. ‘హుజూర్నగర్ విజయం మామూలు విజయం కాదు. బల్లగుద్ది హుజూర్నగర్ నియోజకవర్గం తీర్పు చెప్పింది.
హుజూర్నగర్ 141 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తాం.
ప్రతి గ్రామానికి 25లక్షలు.. మండలానికి 30 లక్షలు సీఎం ప్రత్యేక నిధినుంచి మంజూరు చేస్తాం. హుజూర్నగర్ రోడ్ల అభివృద్ధి కోసం మినరల్ ఫండ్‌కు 25 కోట్లు ఇస్తాం. నేరేడుచర్లకు 15 కోట్ల నిధులు మంజూరు చేస్తాం. దుమ్ములేని స్వచ్ఛమైన హుజూర్‌నగర్‌గా మారుస్తాం. హుజూర్‌నగర్‌ను రెవిన్యూ డివిజన్‌గా వెంటనే మంజూరు చేస్తున్నాను. నియోజకవర్గంలో బంజారా భవన్, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తాం’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో ఏ ఇంచయినా నాదే..!
‘మంత్రి జగదీష్ రెడ్డిని ఢిల్లీకి పంపైనా సరే ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మిస్తాం.
డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం, స్థలాలను పరిశీలించి అందరికీ ఇళ్లను మంజూరు చేస్తాం. 1997 ఎన్టీఆర్ హయాంలో తాగునీటి కోసం సూర్యాపేటలో నేను కరువు మంత్రిగా పాదయాత్ర చేశాను. మొన్నటి ప్రచారంలో నీళ్ల విషయంలో దుర్మార్గపు మాటలు మాట్లాడారు. మూడు ఫీట్లు ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి 300 కిలోమీటర్ల నుంచి కాళేశ్వరం జలాలను తెచ్చి జిల్లాను సస్యశ్యామలం చేశారు.తెలంగాణలో ఏ ఇంచయినా నాదే.. తెలంగాణ అంతటా కోటి 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తా.
కేసీఆర్ దెబ్బ నాగార్జున సాగర్ మీద పడుతుంది. 15 రోజుల్లో అవసరమైన లిఫ్ట్‌లు, బ్రిడ్జిలు అన్నీ నిర్మిస్తాం.నవంబర్ మొదటి వారంలో ఒకటి కాకుంటే రెండు హెలికాప్టర్లలో ఇంజనీర్లతో తిరిగి పరిశీలించాలి.జిల్లాలో ప్రతి ఇంచు భూమికి సైతం నీరు వెళ్లేలా ప్రణాళికలు చేపట్టాలి. నేను కుర్చీ వేసుకుని ఆ పని పూర్తి చేస్తాను.
లిప్ట్లన్నీ రైతులకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
హుజూర్నగర్ నియోజక వర్గానికి దగ్గర దగ్గర 100 కోట్లు మంజూరు చేసినా.. సైది రెడ్డి ఇంకా హుషారుగా ప్రజల కోసం హుజూర్నగర్ రింగ్ రోడ్డు, ట్యాన్క్ బండ్ కావాలన్నారు... మంజూరు చేస్తున్నా. సైదిరెడ్డిది గుంటూరు జిల్లా అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టారు’ అని కేసీఆర్ సుమారు అరగంట పాటు ప్రసంగించించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments