టాలీవుడ్‌కు మళ్లీ షాకిచ్చిన కేసీఆర్.. ఆశలు ఆవిరి!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు లాక్ డౌన్లు పూర్తవ్వగా.. 4.0 మే-18 నుంచి మే-31వరకు ఉండనుంది. ఈ క్రమంలో కొన్ని సడలింపులను కేంద్రం ఇవ్వగా.. మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలకే చాయిస్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకటి అర తప్ప కేంద్రం చెప్పిన మార్గదర్శకాలను పాటిస్తూనే సడలింపులను యథావిధిగా పాటించేస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. సినిమా షూటింగ్స్, రిలీజ్, థియేటర్స్ బంద్ అయ్యి సుమారు రెండు నెలలు దాటిపోయింది. ఇంతవరకూ ఓపెనింగ్స్ లేవ్. అందరికంటే ముందుగానే.. ప్రభుత్వం కూడా ప్రకటించక మునుపే టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా షూటింగ్స్, రిలీజ్లు.. థియేటర్స్‌ను బంద్ చేసింది.
జగన్ తేల్చేశారు!
అయితే.. తమిళనాడు సర్కార్ అక్కడి కోలీవుడ్‌కు ఇప్పటికే లిమిటెట్ స్టాఫ్‌తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అయితే తాజా లాక్ డౌన్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మార్గదర్శకాలతో కూడిన అనుమతులు ఇస్తాయేమోనని దర్శకనిర్మాతలు వేయికళ్లతో వేచి చూశారు. అయితే ఇప్పటికే కేంద్రం చెప్పిన మార్గదర్శకాలను యథావిధిగా పాటించేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చిచేప్పేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఉత్వర్వులను సైతం సోమవారం నాడు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల్లో ప్రత్యేకించి మరీ సినీ ఇండస్ట్రీని గురించి జగన్ కొత్తగా చేర్చించేదేమీ లేదు. షూటింగ్స్‌కు అనుమతిలేదు.. థియేటర్లు మూసివేత అని కేంద్రం చెప్పినట్లే యథావిధిగా ఉందంతే.
మళ్లీ షాకిచ్చిన కేసీఆర్!
అయితే ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్‌లో ఉంది గనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమైనా షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్‌కు కండిషన్స్ పెట్టి సడలింపులు ఇస్తారని దర్శకనిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు వేయి కళ్లతో వేచి చూశాయి. కేసీఆర్ మీడియా మీట్ మొదలుకుని చివరి వరకూ ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని కళ్లార్పకుండా చూశారు. కానీ కేసీఆర్ మాత్రం సింపుల్‌గా నో సినిమా రిలీజ్.. థియేటర్స్, మల్టిఫ్లెక్స్ ఓపెన్ చేయడానికి అసలు వీల్లేదని ఒకే ఒక్క మాటతో తేల్చేశారు. దీంతో కేసీఆర్ నుంచి ఏదో ఒక ప్రకటన వస్తుందని ఆశించిన వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని షాపులు తెరుచుకోవచ్చని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం థియేటర్స్‌కు నో చెప్పేసింది.
ఇందుకేనా..!?
కాగా.. షూటింగ్, సినిమా రిలీజ్లు అంటే కచ్చితంగా జనాలు గుమిగూడుతారు కనీసం లేదంటే వంద నుంచి మొదలై వేలాది మందితో షూటింగ్ జరుగుతుంది గనుక తద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయ్. అందుకే కొద్ది రోజుల పాటు కష్టాల తప్పవని.. పరోక్షంగా ప్రభుత్వాలు ఇలా ‘నో’ చెప్పేస్తున్నాయి. మొత్తానికి చూస్తే.. ఈ 4.0 లాక్ డౌన్‌లోనూ నో సినిమాస్ అన్న మాట. వాస్తవానికి ఫంక్షన్ హాల్స్, మాల్స్, సినిమా హాల్స్, సభలు, ర్యాలీలు, సమావేశాలు అదే విధంగా విద్యా సంస్థలు ఓపెన్ చేస్తే పెనుముప్పు పొంచి ఉందని ముందే గ్రహించిన తెలంగాణ సర్కార్ వీటన్నింనీ బంద్ చేసింది.
అదే విధంగా హోటల్స్, పబ్, క్లబ్, బార్లు, స్టేడియం, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్ ఆఖరికి పార్కులకు కూడా అనుమతి లేదని తేల్చింది. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువగా జనసమూహం వచ్చేదే గనుక. అందుకే సినిమా షూటింగ్స్, రిలీజ్ విషయంలో కూడా కఠువుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పుకోవచ్చు. మరి మే-31 తర్వాత అయినా టాలీవుడ్‌కు మంచి రోజులు వస్తాయా లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మరో రెండు నెలల వరకు కూడా షూటింగ్స్‌కు అయితే అనుమతి ఇచ్చేలా కనిపించడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout