చిత్ర పరిశ్రమకు కేసీఆర్ వరాల జల్లు
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ ప్రభావంతో లాక్‌డౌన్ విధించడం, ఫలితంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోవడం తదితర కారణాలతో చిత్ర పరిశ్రమకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రితోప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారు. సినీ పరిశ్రమకు జరిగిన నష్టాలను వివరించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుండి చిత్ర పరిశ్రమకు మద్దతు ఉంటుందని తెలియజేసిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో సినీ పరిశ్రమపై కేసీఆర్ వరాల జల్లును కురిపించారు.
అందులో భాగంగా 10 కోట్లు లోపు నిర్మించే సినిమాలకు జీఎస్‌టీ రియింబర్స్‌మెంట్‌ను కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే థియేటర్ వారి ఇష్టప్రకారం షోస్ సంఖ్యను పెంచుకునేందుకు, సినిమా టికెట్ రేట్స్ థియేటర్స్ యాజమాన్యం వారి ఇష్టప్రకారం పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. అంతే కాకుండా ఆరు నెలల పాటు థియేటర్లు లో కరెంట్ బిల్లు రధ్ధుచేస్తామని CM KCR తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన వరాలపై సినీ పరిశ్రమ ప్రముఖులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments