ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్..

  • IndiaGlitz, [Monday,November 16 2020]

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కరోనా కాలంలో ఆర్టీసీ ఉద్యోగులకు 50 శాతం వేతనాన్ని మాత్రమే చెల్లించారు. ఇలా రెండు నెలల పాటు సగం జీతాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఆదివారం ఆర్టీసీపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల భద్రతపై చర్చించిన కేసీఆర్.. త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఈ నేపత్యంలో కోవిడ్ కారణంగా ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో కోత విధించిన సగం జీతాన్ని తిరిగి చెల్లించాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగుల 50 శాతం వేతనాన్ని తిరిగి చెల్లించేందుకు దాదాపు రూ. 120 నుంచి రూ. 130 కోట్లను విడుదల చేయాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా... పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటింది. ఈ నేపథ్యంలో కేసీఆర్.. ఆర్టీసీ అధికారులను అభినందించారు. అలాగే సోమవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులను పురనరుద్దరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కాగా.. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చిలో గ్రేటర్ పరిధిలోని బస్సులు సైతం నిలిచాయి. ఇటీవల అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా 25 శాతం బస్సులను పునరుద్ధరించారు. పరిస్థితులు అనుకూలిస్తే గ్రాడ్యువల్‌గా బస్సులను తిప్పాలని ప్రభుత్వం భావించింది. ఇటీవల తిరుగుతున్న బస్సుల కారణంగా ఎలాంటి కోవిడ్ పరమైన ఇబ్బందులూ తలెత్తకపోవడంతో నగర వాసుల అవసరం దృష్ట్యా 50 శాతం బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీని సీఎం ఆదేశించారు. దీంతో రేపటి నుంచి గ్రేటర్‌లో 50 శాతం బస్సులు రోడ్డెక్కనున్నాయి.

More News

నీతో నువ్వు డాన్స్‌ చేయాలంటే....  :  పూరీ జగన్నాథ్‌

'ఫ్రెండ్‌షిప్‌ వేరు ఫ్రెండ్లీనెస్‌ వేరు' అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా పూరి ఫ్రెండ్లీనెస్‌ గురించి మాట్లాడారు.

పవర్‌స్టార్‌ సినిమా గురించి సాగర్‌ చంద్ర ఏమన్నాడంటే....!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.

బాబాయి-అబ్బాయి హోస్టులుగా రియాలిటీ షో...

హీరోలంతా బుల్లితెర బాట పడుతున్న విషయం తెలిసిందే. అంతా హోస్టులుగా బుల్లితెరపై విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.

ప్రియురాలి చేతిలో మోసం.. కెనడాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

కెనడాలో తెలుగు యువకుని ఆత్మహత్య సంచలనం రేపుతోంది. ప్రేమించిన యువతి మోసం చేసిదనే బాధతో ప్రణయ్ అనే యువకుడు నెట్రోజన్ గ్యాస్‌ను పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబంతో కలిసి ఆనందంగా దీపావళిని జరుపుకున్న రాజశేఖర్

హీరో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.