చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

  • IndiaGlitz, [Monday,November 23 2020]

కోవిడ్ ప్ర‌భావంతో లాక్‌డౌన్ విధించ‌డం, ఫ‌లితంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చాలా న‌ష్టం జ‌రిగింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సినీ రంగానికి చెందిన పెద్ద‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రితోప్ర‌త్యేకంగా సంప్ర‌దింపులు జ‌రిపారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు జ‌రిగిన న‌ష్టాల‌ను వివ‌రించి ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరారు. ముఖ్య‌మంత్రి కూడా సానుకూలంగా స్పందించి ప్ర‌భుత్వం నుండి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్లుగానే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టోలో సినీ ప‌రిశ్ర‌మ‌పై కేసీఆర్ వ‌రాల జ‌ల్లును కురిపించారు.

అందులో భాగంగా 10 కోట్లు లోపు నిర్మించే సినిమాలకు జీఎస్‌టీ రియింబ‌ర్స్‌మెంట్‌ను క‌ల్పించనున్న‌ట్లు తెలిపారు. అలాగే థియేటర్ వారి ఇష్టప్రకారం షోస్ సంఖ్య‌ను పెంచుకునేందుకు, సినిమా టికెట్ రేట్స్ థియేటర్స్ యాజమాన్యం వారి ఇష్టప్రకారం పెంచుకునేందుకు అనుమతి ఇస్తామ‌ని తెలిపారు. అంతే కాకుండా ఆరు నెల‌ల పాటు థియేటర్లు లో కరెంట్ బిల్లు రధ్ధుచేస్తామని CM KCR తెలిపారు. కేసీఆర్ ప్ర‌క‌టించిన వ‌రాల‌పై సినీ పరిశ్ర‌మ ప్ర‌ముఖులు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

More News

డ‌బుల్ డోస్ ఇస్తామంటున్న హిట్ కాంబో...

13 ఏళ్ల ముందు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన చిత్రం ‘ఢీ’. సరికొత్త స్టైల్లో ఫన్‌తో తెర‌కెక్కిన చిత్రం అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

తమిళనాడు తెలుగు విలేకరి దారుణ హత్య

తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.

సమంత పోస్టుపై అఖిల్ కామెంట్

అక్కినేని వారి కోడలు సమంత ఓ ఫోటోని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఆ పోస్టుపై ఆమె మరిది.. హీరో అఖిల్ స్పందించాడు.

రాములమ్మ మళ్ళీ ఆ పార్టీలోకి ?

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి పార్టీ మార్పు విషయమై క్లారిటీ వచ్చేసింది.

‘నివర్’గప్పుతున్న తుపాను.. 26 వరకూ భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు మరో తుపాను ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.