ఆ సీక్రెట్ వీడియోలే కేసీఆర్ 'రిటర్న్ గిఫ్ట్' కాబోలు!?

  • IndiaGlitz, [Saturday,January 19 2019]

తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టిన సీఎం చంద్రబాబుకు కచ్చితంగా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చితీరుతామని ఇందులో ఎలాంటి సందేహం లేదని కేసీఆర్ శపథం చేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇందుకు కౌంటర్‌‌గా ‘నాకేం చేతకాదా.. నువ్వొకటిస్తే నేను మూడు రిటర్న్ గిఫ్టులిస్తా’ అని గులాబీ బాస్‌‌కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ తరుణంలో వైసీపీకి చెందిన ఓ నేత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

బాబు అవకాశవాది..
వైసీపీ అధినేత జగన్-కేటీఆర్ భేటీతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు కౌంటర్‌ మాట్లాడటానికి మీడియా ముందుకొచ్చిన కాకినాడ వైసీపీ కో-ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని ఆయన స్వార్థం కోసం ఏ పార్టీతో అయినా జతకాడతారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఎదుర్కొంనేందుకు మహాకూటమి అంటూ కేసీఆర్‌తో చంద్రబాబు జట్టుకట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఇదేనేమో రిటర్న్ !
రిటర్న్ గిఫ్ట్ రాజకీయాలపై మాట్లాడిన ద్వారంపూడి.. కూకట్‌పల్లిలో లోధియా అపార్ట్‌మెంట్‌లో మంత్రి లోకేష్‌ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను కేసీఆర్‌ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉంది. బహుశా చంద్రబాబుకు కేసీఆర్‌ ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ అదే కాబోలు అని ఉన్నట్టుండి బాంబు పేల్చారు.

ఇంతకీ లోకేశ్‌కు సంబంధించిన సీక్రెట్ వీడియోలు ఏంటి..? కూకట్‌‌పల్లిలో లోకేశ్ చేసిన అక్రమాలేంటి? అని అటు వైసీపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు ఆరా తీసే పనిలో పడ్డారట. ఒక వేళ వైసీపీ నేత చెప్పినట్లుగానే కేసీఆర్ ఆ వీడియోలు బయటపెడితే చంద్రబాబు, లోకేశ్‌ల పరిస్థితేంటి? అసలు నిజంగానే వీడియోలున్నాయా..? లేకుంటే ఏదో ఒక రాయేద్దామని ద్వారంపూడి ఇలా అన్నారా అనేది తెలియాలంటే టీడీపీ లేదా.. టీఆర్ఎస్ స్పందిస్తే ఈ వీడియోలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

More News

విజ‌య్ దేవ‌ర కొండ నిర్మాణంలో స్టార్ యాంక‌ర్‌

స్టార్ యాంక‌ర్‌గా పేరున్న అన‌సూయ ఇప్పుడు సినిమాల్లో కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ ఉంది. రీసెంట్‌గా 'ఎఫ్ 2' చిత్రంలో కూడా చిన్న గెస్ట్ పాత్ర‌లో త‌ళుక్కున మెరిసింది.

ఆయనొకటి.. ఈయనేమో మూడు.. అసలేంటీ కథ చంద్రులు!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజ రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారిపోతున్నాయి.

ఫిబ్ర‌వ‌రిలో శౌర్య కొత్త చిత్రం

స‌క్సెస్‌కు ఉన్న గుర్తింపు వేరే. అదే స‌క్సెస్‌లో లేన‌ప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోరు. కానీ ఇప్పుడు నాగ‌శౌర్య‌కు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది.

చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో సందీప్‌కిష‌న్ 'నిను వీడ‌ని నీడ‌ను నేనే'

మ‌నిషి శ‌త్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుందో ఆలోచించండి..

ఇంత చేసిన కేసీఆర్‌ యుద్ధభేరికి ఎందుకు వెళ్లలేదు!?

గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది కిందటి నుంచే ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ అని పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో వరుసగా భేటీలు జరిపిన సంగతి తెలిసిందే.