షాద్‌నగర్ ఘటనపై కేసీఆర్ తీవ్ర ఆవేదన.. కఠిన చర్యలే!
Send us your feedback to audioarticles@vaarta.com
వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుక్షణం నుంచే వాళ్లు భూమ్మీద బతకడానికి వీల్లేదని వెంటనే ఉరిశిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయాలంటూ.. వారుండే పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో పలు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో నిన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద.. ఇవాళ చర్లపల్లి జైలు వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఈ కేసును తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు.
కఠినంగా శిక్షిస్తాం..
అయితే ఈ ఘోర ఘటనపై సీఎం కేసీఆర్ ఫస్ట్ టైమ్ స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్‌లో ఆత్మీయ సమావేశం సందర్భంగా కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడారు. ఇది దారుణమైన, అమానుషమైన సంఘటన అని తీవ్ర ఆవేదనగా లోనయ్యారు. మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయని, రాత్రి సమయంలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాత్రి సమయంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దని సూచించారు. షాద్‌నగర్ హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. షాద్‌నగర్ నిర్భయ కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments