షాద్‌నగర్‌ ఘటనపై కేసీఆర్ తీవ్ర ఆవేదన.. కఠిన చర్యలే!

  • IndiaGlitz, [Monday,December 02 2019]

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుక్షణం నుంచే వాళ్లు భూమ్మీద బతకడానికి వీల్లేదని వెంటనే ఉరిశిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయాలంటూ.. వారుండే పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో పలు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో నిన్న షాద్ నగర్‌ పోలీస్ స్టేషన్ వద్ద.. ఇవాళ చర్లపల్లి జైలు వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఈ కేసును తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు.

కఠినంగా శిక్షిస్తాం..
అయితే ఈ ఘోర ఘటనపై సీఎం కేసీఆర్ ఫస్ట్ టైమ్ స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్‌లో ఆత్మీయ సమావేశం సందర్భంగా కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడారు. ఇది దారుణమైన, అమానుషమైన సంఘటన అని తీవ్ర ఆవేదనగా లోనయ్యారు. మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయని, రాత్రి సమయంలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాత్రి సమయంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దని సూచించారు. షాద్‌నగర్ హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. షాద్‌నగర్ నిర్భయ కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

More News

డాక్టర్ దారుణ హత్య: ప్రధాని మోదీకి కేటీఆర్ రిక్వెస్ట్!

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది.. వరాలే వరాలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా డైలాగ్స్ పేల్చారు. ఆదివారం నాడు ఇవాళ ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా విందు సమావేశం నిర్వహించారు.

డిసెంబర్ 20 న 'దొంగ‌'

ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రానున్నాడు. ఈ చిత్రం లో కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు

సాయి రామ్ శంకర్ హీరో గా కృష్ణ చిరుమామిళ్ల దర్శకతం లో 'రి సౌండ్'

రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్  పతాకం పై దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరో

తనీష్ 'మహాప్రస్థానం'

తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. జర్నీఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక.