KCR:సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. మొత్తం 65 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థులు 39 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ విజయం ఖాయం కావడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన ఓఎస్డీ ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించారు. అనంతరం సొంత వాహనంలోనే తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక 2014 నుంచి ఇప్పటివరకు తొమ్మిదన్నరేళ్ల పాటు ఆయన సీఎంగా కొనసాగారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దాని కంటే ఎక్కువ స్థానాలు రావడంతో సోమవారమే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ రేవంత్ రెడ్డితో సమావేశమై భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీజీపీకి సూచించారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేలతో చర్చించి సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకుంటారు. రేపు ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌ను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు 2 ప్లస్ 2 గన్‌మెన్లను ఏర్పాటుచేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments