KCR:సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం..

  • IndiaGlitz, [Monday,December 04 2023]

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. మొత్తం 65 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థులు 39 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ విజయం ఖాయం కావడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన ఓఎస్డీ ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించారు. అనంతరం సొంత వాహనంలోనే తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక 2014 నుంచి ఇప్పటివరకు తొమ్మిదన్నరేళ్ల పాటు ఆయన సీఎంగా కొనసాగారు.

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దాని కంటే ఎక్కువ స్థానాలు రావడంతో సోమవారమే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్‌ రేవంత్ రెడ్డితో సమావేశమై భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీజీపీకి సూచించారు.

ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేలతో చర్చించి సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకుంటారు. రేపు ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌ను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు 2 ప్లస్ 2 గన్‌మెన్లను ఏర్పాటుచేయనున్నారు.

More News

KCR, Revanth Reddy:కామారెడ్డిలో సంచలనం.. కేసీఆర్, రేవంత్‌ రెడ్డి ఓటమి..

కామారెడ్డి నియోజకవర్గంలో సంచలనం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్,

KTR:ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తాం: కేటీఆర్

తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Telangana DGP:తెలంగాణ డీజీపీపై వేటు.. ఈసీ సంచలన నిర్ణయం..

తెలంగాణ ఫలితాల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది.

KTR:ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. తమ గురి తప్పిందని ట్వీట్..

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని..

BJP Candidates:గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు వీరే..

గత ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు 5 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా..