ప్రగతి భవన్‌‌కు కేసీఆర్.. అన్ని విమర్శలకూ చెక్..

  • IndiaGlitz, [Saturday,July 11 2020]

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చారు. కాగా.. సీఎం కేసీఆర్ ఎక్కడా.. ఎక్కడా? అంటూ విపక్షాలు, సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో రాద్దాంతం చేస్తున్నాయి. ఒకరైతే ఏకంగా ఆయన జాడ చెప్పాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. మరొకరు ‘సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’ అంటూ ప్రగతి భవన్ వద్ద హల్ చల్ చేసి మెరుపులా మాయమయ్యారు. చివరకు ఆ యువకులను పంజాగుట్ట పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల కేసీఆర్ రైతులతో మాట్లాడిన ఆడియో సైతం లీక్ అయినప్పటికీ విపక్షాలు దానిని కొట్టి పారేశాయి.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌కు చేరుకుని షాక్ ఇచ్చారు. అన్ని రాద్దాంతాలకూ.. విమర్శలకూ చెక్ పెట్టారు. రెండు వారాలుగా ఆయన ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏమైనా మీడియాతో మాట్లాడతారా? లేదంటే ప్రగతి భవన్‌లో పనులుంటే చూసుకుని వెళ్లిపోతారా? మాట్లాడితే ఏం మాట్లాడతారు? విపక్షాలపై ఎన్ని బాణాలను ఎక్కుపెడతారు? తను కనబడటం లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై స్పందింస్తారా.. లేదా? ఎన్నో ప్రశ్నలు ప్రజల మనసులో మెదలుతున్నాయి.

More News

ఇంత నిర్లక్ష్యమా? ఇది మీకు తగునా?

కరోనా మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా తరలించాలి. నిబంధనల ప్రకారమైతే తరలించే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి..

దిల్‌రాజు అడుగు అక్క‌డ కూడా!!

తెలుగు చిత్ర నిర్మాత‌ల్లో దిల్‌రాజుకు ఓ ప్ర‌త్యేక‌స్థానం ఉంది. ఆయ‌న అగ్ర హీరోల‌తో పాటు కొత్త కంటెంట్ సినిమాల‌ను కూడా చేయ‌డంలో ఆస‌క్తి చూపిస్తుంటారు.

‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’కు భారీ ఆదరణ.. దీంతో కొందరేం చేశారంటే..

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకానికి

జీ5 ఓటీటీ నెక్స్ట్ తెలుగు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తున్న సుష్మితా కొణిదెల, విష్ణు ప్రసాద్

హైదరాబాద్, 11 జూలై 2020: స్ఫూర్తివంతమైన 'లూజర్' నుండి 'చదరంగం', 'గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)' వరకు... బెస్ట్ కంటెంట్‌ను తెలుగు వీక్షకులకు అందించడంలో జీ5

సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ సచివాలయ అంశం

తెలంగాణ సచివాలయ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.