ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న కల్వకుంట్ల కవిత!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు..? అదేంటి ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోయింది కదా..? ఆమెకు ఢిల్లీకెళ్లి చక్రాలు, బొంగరాలు అంటారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు వింటున్నది అక్షరాలా నిజమే. ఎందుకంటే కవితకు మళ్లీ పగ్గాలొస్తున్నాయ్.. ఇక చూస్కోండి..? అంటూ కల్వకుంట్ల వారి అభిమానులు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇంతకీ కవిత కథేంటి..? ఇందులో నిజానిజాలెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫలితం ఇదీ..!
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు నిజామాబాద్ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో కల్వకుంట్ల కవిత ఇంటికి పరిమితం కాగా.. అరవింద్‌ను నిజామాబాద్ ప్రజలు.. ముఖ్యంగా రైతులు పార్లమెంట్‌కు పంపారు. స్వయానా సీఎం కేసీఆర్ కుమార్తే ఓటమి చెందడంతో గులాబీ బాస్ కూడా ఒకింత అసంతృప్తికి లోనయ్యారట. తెలంగాణలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోగా, 4 స్థానాలు బీజేపీ.. 3 స్థానాలు కాంగ్రెస్, ఒక స్థానం ఎంఐఎం గెలుచుకున్నాయి. అయితే 16 స్థానాలు గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పిన కేసీఆర్‌కు చివరకు ఊహించని పరాభావం ఎదురైంది.
మొదట అనుకున్నారు కానీ..!
నిజామాబాద్‌లో ఓడిపోయిన కవితకు తెలంగాణ కేబినెట్లో స్థానం కలిపించబోతున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కవితకు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ పార్టీలో చర్చలు నడిచాయ్. కవితకు ఓ కీలక శాఖ అప్పగించాలని కేసీఆర్ భావించారని కూడా వార్తలు వినవచ్చాయి. అయితే ఆ ప్రయత్నాలన్నీ మానుకున్న కేసీఆర్.. ఢిల్లీపైనే దృష్టిసారించారట. కొడితే కొండనే కొట్టాలి కానీ.. అడప దడఫా వద్దనుకున్నారేమో కేసీఆర్ కన్నంతా ఢిల్లీపైనే ఉంది. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సీట్లు అటు ఇటు వచ్చి ఉంటే మాత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు కింగ్ మేకర్స్ అయ్యేవారు.. అప్పుడిక ఈ ఇద్దరు చెప్పిందే జరిగేది. అయితే రోజురోజుకు బీజేపీకి కాలం దగ్గరపడుతోందని.. ఇక రానున్న ఎన్నికల్లో చక్రం తిప్పేది మనమే అనుకున్న కేసీఆర్.. ఈ మేరకు ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలెట్టేశారట.
పెద్దల సభకు కవిత!
ఢిల్లీలో మనం చక్రం తిప్పాలనుకుంటే ఒకటి రాజ్యసభ లేదా లోక్‌సభ సభ్యురాలై ఉండాలి. ప్రస్తుతం ఎలాగో ఇద్దరి రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ రెండు స్థానాల్లో తమకు బాగాకావాల్సిన వారిని పెద్దలకు సభకు పంపాలని భావించిన కేసీఆర్.. ఒకరు కవిత కాగా.. మిగిలిన వారిలో కేకే ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభకు తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులుండగా, వారిలో టీఆర్ఎస్కు చెందిన వారు ఆరుగురు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు స్థానాలకు ఆశావహులు మాత్రం చాలా మందే ఉన్నారు.
సో.. ఎలాగైతేనేం ఢిల్లీలో చక్రం తిప్పడమే టార్గెట్‌గా పెట్టుకున్న కేసీఆర్.. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి కుమార్తెను రంగంలోకి దింపుతున్నారన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments