అదంతా ఫేక్.. ఈ ఫుడ్ తింటే కరోనా ఖతం: కేసీఆర్

కరోనా వైరస్ భయంతో ప్రజలు అందరూ అల్లాడుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ప్రజల్లో నెలకొన్న కొన్ని కొన్ని సందేహాలను నివృత్తి చేశారు. ‘చికెన్ తింటే కరోనా వస్తుందని ఈ మధ్య కొందరు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి చికెన్ తింటే కరోనా తగ్గుతుంది. చికెన్ అనేది ప్రొటీన్. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. చికెన్, గుడ్లతో పాటు నిమ్మ, బత్తాయి, కమలా పండ్లు తినాలి. ఈ పండ్లలో విటమిన్ సీ ఉంటుంది’ అని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అంతా ఆగమాగం చేయవద్దు!

‘పశుగ్రాసం, పాలు, నిత్యావసర వాహనాలు తిరగాలి. డైరీ పామ్ ఓనర్‌లు మీకు ఎవరు సప్లై చేశారో వారితో మీరు సంప్రదించి తెప్పించుకోవచ్చు. పౌల్ట్రీ ఉత్పత్తులు కూడా రావాలి కాబట్టి రానివ్వాలి. చికెన్ తింటే వైరస్ వస్తుంది.. అని కొంత మంది దుర్మార్గులు ప్రచారం చేశారు. కానీ చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది’ అని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. పండ్ల వాహనాలకు ప్రత్యేక పాస్‌లు ఇవ్వాలి వాటిని అన్నింటిని కూడా హైదరాబాద్‌కు తెప్పించాలి. గుడ్లు కూడా తినాలి.. ఆ వాహనాలను కూడా అనుమతి ఇవ్వాలి. 50 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది. పంట కోత జరగాలి.. హార్వెస్టార్ అందుబాటులో ఉన్నాయి. పంట అమ్ముకోవాలి ప్రపంచ మొత్తం యుద్ధంలో ఉంది. ఎప్పుడైనా చూశామా ఓల్డ్ సిటీలో తప్ప ఎక్కడైనా కర్ఫ్యూ..?. రైతులకు దయచేసి విజ్ఞప్తి.. నాది ముందు నిది ముందుకాదు ఒక్కరి తరువాత ఒక్కరు కొనుకోవచ్చు. ఐకేపీ కేంద్రాలు పెట్టరు. వ్యవసాయ శాఖ అధికారులు అందరూ గ్రామాల్లో ఉంటారు. మీరు అంతా ఆగమాగం చేయవద్దు. పంట కొనేందుకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తోంది’ అని కేసీఆర్ తెలిపారు.

మీ డబ్బులు ఎక్కడికీ పోవు!

‘మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వం కొంటుంది మీకు చెక్‌లు ఇస్తాం మీరు వచ్చేవారు బ్యాంక్ ఖాతాలు తేవాలి. మీ డబ్బులు ఎటుపోవు, కొంత అటు ఇటు మీ ఖాతాలో పడతాయి. మీ ధాన్యం గోదాం లలో పెడుతాం,అవ్వి కూడా సరిపోకపోతే ప్రభుత్వ స్కూల్‌లలో పెడతాం. ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగొలు చేస్తాం. ప్రైవేట్ వ్యాపారులు కూడా కొనుకోవచ్చు కానీ మద్దతు ధర ఇవ్వాలి. ఊర్లలో వేసిన కంచెలను కూడా తొలగించాలి. ఎందుకంటే మీ ఊరు పంటలు కొనాలంటే లారీలు రావాలి. ఇంకా ఇతర రవాణా సరుకులు కూడా రావాలి’ అని అధికారులు, పోలీసులను కేసీఆర్ స్పష్టం చేశారు.

More News

బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కూడా కరోనా పాజిటివ్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చిందనే షాకింగ్ విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త విన్న కొన్ని గంటల వ్యవధిలేనే మరో ఊహించని విషయం వెలుగుచూసింది.

షాకింగ్: బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్!

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

క‌రోనా వైర‌స్ నివార‌ణా చ‌ర్య‌ల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సినీ తార‌లు

"ఆడు క‌న‌బ‌డితే నిప్పు క‌ణం నిల‌బ‌డిన‌ట్టుంట‌ది.." గూజ్ బమ్స్ రేపుతున్న రామ‌చర‌ణ్ బ‌ర్త్‌డే ట్రీట్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీబ‌డ్జెట్‌, హైటెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఈఎంఐ చెల్లింపు దారులకు భారీ ఊరట

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు.. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు