ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేస్తాం: కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎంతమందికైనా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా సీఎం ప్రకటన చేశారు. బుధవారం నాడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలు తీరుపై నిశితంగా చర్చించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. పేదలకు సాయంతో ప్రజాప్రతినిదులు చొరవ, సహకారం కొనసాగాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత లేనేలేదని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని ఈ సందర్భంగా మరోసారీ సీఎం తేల్చిచెప్పారు.
మార్పులు, చేర్పులు..!
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం 553 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం 8 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతున్నదని చెప్పారు. ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిథిగా లాక్ డౌన్ అమలవుతుందన్నారు. తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటిలాగానే సహకరించాలన్నారు. రాష్ట్రంలో 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నామని.. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments