ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేస్తాం: కేసీఆర్

  • IndiaGlitz, [Wednesday,April 15 2020]

తెలంగాణలో ఎంతమందికైనా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా సీఎం ప్రకటన చేశారు. బుధవారం నాడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలు తీరుపై నిశితంగా చర్చించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. పేదలకు సాయంతో ప్రజాప్రతినిదులు చొరవ, సహకారం కొనసాగాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత లేనేలేదని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని ఈ సందర్భంగా మరోసారీ సీఎం తేల్చిచెప్పారు.

మార్పులు, చేర్పులు..!

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం 553 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం 8 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతున్నదని చెప్పారు. ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిథిగా లాక్ డౌన్ అమలవుతుందన్నారు. తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటిలాగానే సహకరించాలన్నారు. రాష్ట్రంలో 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నామని.. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.

More News

ప్ర‌భాస్ జ‌త‌గా చేయ‌డానికి భారీ డిమాండ్ చేసిన బ్యూటీ

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా

తెలుగు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లు ప్రకటించిన కేంద్రం

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్‌పై పోరులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ను మే-03 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం..

'ఆర్ఆర్ఆర్‌'ని చిరంజీవి ప్రొడ్యూస్ చేయాల‌నుకున్నారా?

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్‌). టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ‘కరోనా’ సర్వే!

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనాపై పోరు చేస్తూ సర్వే జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇప్పటి వరకూ మూడు సర్వేలు పూర్తి చేయడం జరిగిందన్నారు.

షాకింగ్ : ఏపీలో కరెన్సీ ద్వారా ఇద్దరికి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే