జగన్ నిర్ణయంపై కేసీఆర్ అభ్యంతరం.. న్యాయపోరాటం!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఇదేంటి.. నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి సఖ్యతగా ఉన్నారు కదా..? సడన్గా ఏమైంది..? అసలేం జరిగింది..? న్యాయ పోరాటం చేయాల్సినంత పని సీఎం వైఎస్ జగన్ ఏం చేశారు..? అసలు జగన్ సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయమేంటి..? అని అనుకుంటున్నారు కదా.. అవును జగన్ తీసుకున్న నిర్ణయంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు..? ఇంతకీ ఏం జరిగింది..? అనే ఆసక్తికర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదీ కథ..!?
అసలు విషయానికొస్తే.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఏపీలోని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అంతేకాదు ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల చేసేసింది సర్కార్. అయితే ఈ పథకంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రాజెక్ట్ను అడ్డుకుంటామని.. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని కేసీఆర్ తేల్చిచెప్పేశారు. సోమవారం నాడు ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిశితంగా చర్చించారు. అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులు ఈ ఎత్తిపోతల పథకంపై పలు సలహాలు, సూచనలు తీసుకుని కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవచ్చింది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధమేనని.. ఇందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను గులాబీ బాస్ ఆదేశించినట్లు తెలియవచ్చింది.
న్యాయపోరాటమే..!?
జగన్ తీసుకున్న నిర్ణయం అమలు అయితే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమేనని.. అందుకే ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాగా.. కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో ఫిర్యాదుకు ఆదేశించినట్లు సమాచారం. ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం నీటి విషయంలో తెలంగాణను సంప్రదించకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సబబు కాదని.. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ సర్కార్ ఘోర తప్పిదమని సమీక్షలో కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్లు తెలియవచ్చింది. అంతేకాదు.. ఇది ముమ్మటికీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదమేనని ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని సీఎం తేల్చిచెప్పడం గమనార్హం.
ఏం జరుగుతుందో ఏమో..!?
మొత్తానికి చూస్తే ఈ కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ వర్సెస్ జగన్గా పరిస్థితులు మారబోతున్నాయని దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్ రియాక్షన్ అయిపోయింది.. జగన్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారు..? కేసీఆర్పై విమర్శలు గుప్పించి మాట్లాడుతారా..? అసలు ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..? ఈ అంశంపై జగన్ నిర్ణయమేంటి..? ఇప్పటికే పలు వివాదాస్పద, సంచలన నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్ ఈ విషయంలో కూడా దూకుడుగానే వెళ్తారా..? అసలేం జరగబోతోంది..? సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటారా..? లేకుంటే ఫైట్ చేసుకుంటారా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నేతలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout