'పీవీ నరసింహారావు' పేరుతో కొత్త జిల్లా.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్?
Send us your feedback to audioarticles@vaarta.com
10 జిల్లాల తెలంగాణాని కేసీఆర్ 33 జిల్లాలుగా మార్చారు. తెలంగాణాలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతున్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది. హుజురాబాద్ కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భారత మాజీ ప్రధాని, దివంగత నేత అయిన పీవీ నరసింహారావు పేరుతో ఈ జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రవితేజ కథ మెగా హీరోకి సెట్ అవుతుందా ?
ఇప్పటికే పీవీ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతంలో డిమాండ్ ఉంది. ఈ నెల 28న పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆ సందర్భంగా కొత్త జిల్లా ప్రకటన చేస్తే బావుంటుందనేది కేసీఆర్ ఆలోచన. హుజురాబాద్ నుంచి పివి నరసింహారావు స్వగ్రామం వంగరకు 8 కిలోమీటర్లు.
ఆ ప్రాంతంలో 12 మండలాలు కొత్త జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ ఇటీవల తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమయంలో పివి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదే కనుక జరిగితే ఆ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీకి మైలేజి పెరిగి ఈటెలకు చెక్ పెట్టవచ్చు అనేది టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వ ఆలోచనగా తెలుస్తోంది. ప్రారంభం నుంచి కేసీఆర్ పీవీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డగా పీవీ దేశంలో అత్యున్నత పదవిని అధిరోహించారు.
కేసీఆర్ ఇటీవల పీవీ కుమార్తెకు టిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి గెలిపించిన సంగతి తెలిసిందే. మొత్తంగా తెలంగాణాలో మరో కొత్త జిల్లా ఏర్పాటు ఆసక్తికరంగా మారితే.. దాని చుట్టూ ఉన్న రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout