Telangana Formation Day: నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు రూ.2 కోట్ల రివార్డ్.. చెక్కులను అందజేసిన కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్, జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఇషా సింగ్‌లకు తలా రూ.2 కోట్లు చొప్పున తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
పద్మశ్రీ మొగిలయ్యకు రూ.కోటి చెక్ అందజేసిన కేసీఆర్:
దీనిలో భాగంగా గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు చెక్కులను అందజేశారు ముఖ్యమంత్రి. వీరితో పాటు కిన్నెరమెట్ల కళాకారుడు, పద్మశ్రీ మొగిలయ్యకు గతంలో ప్రకటించిన విధంగా రూ.కోటి రివార్డుకు సంబంధించిన చెక్కును కేసీఆర్ ఆయనకు అందజేశారు. అలాగే నిఖత్ జరీన్, ఇషాసింగ్‌లకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోనూ, మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాస స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.
క్రీడాకారులకు శంషాబాద్‌లో ఘనస్వాగతం:
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నిఖత్ జరీన్ 52 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను 5-0 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. అలాగే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో ఇషా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇటీవల స్వదేశానికి చేరుకున్న వీరికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments