KCR:పొలం బాట పట్టనున్న కేసీఆర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

  • IndiaGlitz, [Sunday,March 31 2024]

తెలంగాణలో వర్షాలు లేక పొలాలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతన్నలకు భరోసా నింపేందుకు మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. పలు జిల్లాల్లో పర్యటించి అన్నదాతలను పలకరించనున్నారు. సూర్యాపేట‌, న‌ల్లగొండ, జ‌న‌గామ జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో గులాబీ బాస్ ప‌ర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది.

ఆదివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో కేసీఆర్ బ‌య‌ల్దేరనున్నారు. జ‌న‌గామ జిల్లాలోని ధ‌రావ‌త్ తండాకు ఉద‌యం 10 గంట‌ల‌ 30 నిమిషాలకు చేరుకుని ఎండిపోయిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. అనంతరం 11 గంట‌ల‌ 30 నిమిషాలకు సూర్యాపేట జిల్లాలోని తుంగ‌తుర్తి మండ‌లం, అర్వప‌ల్లి మండ‌లం, సూర్యాపేట రూర‌ల్ మండ‌లాల్లో ప‌ర్యటించి.. ఎండిపోయిన పంట పొలాల‌ను ప‌రిశీలిస్తారు. మ‌ధ్యాహ్నం 1 గంట‌కు సూర్యాపేట రూర‌ల్ మండ‌లం నుంచి బ‌య‌ల్దేరి.. 1.30గంటల వ‌ర‌కు సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు.

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే లంచ్ చేయ‌నున్నారు. తదుపరి 3 గంట‌ల‌కు మీడియా సమావేశం నిర్వహించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి న‌ల్గొండ జిల్లాకు బ‌య‌ల్దేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు నిడ‌మ‌నూరు మండ‌లానికి చేరుకుని ఎండిపోయిన పంటల‌ను ప‌రిశీలించ‌నున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు నిడ‌మ‌నూరు నుంచి ఎర్రవెల్లికి బ‌య‌ల్దేర‌నున్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించి రాత్రి 9 గంట‌ల‌కు ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు.

కాగా పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నేతలందరూ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయారు. దీంతో జిల్లాల పర్యటనలతో క్యాడర్‌లో ఉత్తేజం నింపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. వరుసగా పార్టీ కార్యక్రమాలతో వలసలకు కూడా చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. మరి కేసీఆర్ పర్యటన ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More News

Dasara Combo: 'దసరా' కాంబో రిపీట్.. అభిమానులకు నాని సర్‌ప్రైజ్..

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో 'దసరా' మూవీకి ఓ ప్రత్యేకత ఉంది. రూ.100కోట్లు వసూలు చేసి బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Quit Jagan: 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ'.. ప్రజలకు చంద్రబాబు పిలుపు..

రాయలసీమలో ట్రెండ్ మారిందని.. ప్రజలు ఇక వైసీపీ బెండు తీసేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఎన్నికల్లో 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ'

Maheshwar Reddy: బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది: మహేశ్వర్ రెడ్డి

తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోరని..

YS Sharmila: మహిళలకు ప్రతి నెలా రూ.8500.. ఏపీ కాంగ్రెస్ 9 గ్యారంటీలు ప్రకటన..

తాము అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల తెలిపారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

Chandrababu:దళితులంటే ద్వేషం.. పేదలంటే చులకన.. మారని చంద్రబాబు వైఖరి..

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.