KCR:పొలం బాట పట్టనున్న కేసీఆర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో వర్షాలు లేక పొలాలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతన్నలకు భరోసా నింపేందుకు మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. పలు జిల్లాల్లో పర్యటించి అన్నదాతలను పలకరించనున్నారు. సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో గులాబీ బాస్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది.
ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో కేసీఆర్ బయల్దేరనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చేరుకుని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం 11 గంటల 30 నిమిషాలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి.. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరి.. 1.30గంటల వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే లంచ్ చేయనున్నారు. తదుపరి 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి నల్గొండ జిల్లాకు బయల్దేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి బయల్దేరనున్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించి రాత్రి 9 గంటలకు ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు.
కాగా పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నేతలందరూ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయారు. దీంతో జిల్లాల పర్యటనలతో క్యాడర్లో ఉత్తేజం నింపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. వరుసగా పార్టీ కార్యక్రమాలతో వలసలకు కూడా చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. మరి కేసీఆర్ పర్యటన ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout