కేసీఆర్‌కు యశోదాలో వైద్య పరీక్షలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ ఊపిరితిత్తుల్లో మంట కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో.. వాటిని గురువారం మధ్యాహ్నం యశోదా ఆసుపత్రిలో నిర్వహించనున్నారు.
కాగా.. ఇటీవల ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన నాటి నుంచే కేసీఆర్ అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల గడ్కరీతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ పాల్గొనలేదు. అయితే ఆయన కోలుకున్నాక కేసీఆర్‌ను కలుస్తానంటూ గడ్కరీ ప్రత్యేకంగా ప్రస్తావించటంతో కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారన్న విషయం బయటకు వచ్చింది. అయితే తాజాగా కేసీఆర్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించడం ఆయన అనారోగ్యం పాలయ్యారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. మొత్తానికి నేడు యశోదా వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com