KCR: కేసీఆర్ హెల్త్‌బులిటెన్ విడుదల.. ఏం చెప్పారంటే..?

  • IndiaGlitz, [Friday,December 08 2023]

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ ఎడమ కాలు తుంటి భాగంలో బాల్ రీప్లేస్‌మెంట్ చేయాలని.. సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేస్తామని తెలిపారు. సర్జరీ తరువాత ఆయన నాలుగైదు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని.. కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‭కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలపడంతో వెనుదిరిగి వెళ్లిన ఆయన తాజా పరిస్థితిని రేవంత్‌కు వివరించారు.

ఇదిలా ఉంటే కేసీఆర్ జారిపడిన విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ స్పందించారు. కేసీఆర్‌ గాయపడ్డారని తెలిసి బాధ కలిగింది. ఆయన ఆరోగ్యం బాగుండాలని గాయం నుంచి త్వరగా కోలుకోవాలి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. అటు కేసీఆర్ తుంటి ఎముకకు స్వల్ప గాయమైందని, నిపుణుల సంరక్షణలో ఉన్నారని కేసీఆర్ కుమార్తె కవిత తెలిపారు. అందరి మద్దతు, దీవెనలతో నాన్న త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని పేర్కొ్న్నారు. అలాగే పలువురు ప్రముఖులు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

కాగా గురువారం అర్థరాత్రి కేసీఆర్.. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నివాసంలో కాలు జారి కింద పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్‌తో పోలీసుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీచేశారు. ఆసుపత్రికి చేరుకోగానే వెంటనే పరీక్షలు నిర్వహించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగిందని గుర్తించారు.

More News

CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌తో పాటు ఇతర సినీ,

Pawan Kalyan:సీఎం పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

సీఎం పదవిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగసభలో

CM Revanth Reddy:ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగానే ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని

Bigg Boss Telugu 7 : శోభాశెట్టికి ఎలిమినేషన్ భయం.. ప్రశాంత్‌ను కొరికేసిన అమర్, ఆపై మాటలతో ఎదురు దాడి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది.

AP Govt:ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల..

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.