తెలంగాణలో వీటికి మాత్రమే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ 4.0 లాక్ డౌన్ కొనసాగిస్తామని రాష్ట్రముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏమేం నడుస్తాయ్..? వేటికి అనుమతి ఉంటుంది..? వేటికి అనుమతి ఉండదు..? అనే విషయాలను మీడియా ముఖంగా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వెల్లడించారు.
వేటికి గ్రీన్ సిగ్నల్.. వేటికి రెడ్ సిగ్నల్..
- రాష్ట్రంలోని కంటైన్మెంట్ ఏరియాల్లో తప్ప అన్ని ప్రాంతాల్లో షాపులు తెరుచుకోవచ్చు.
- హైదరాబాద్‌లో తప్ప మిగతా తెలంగాణలో అన్ని షాపులు అన్ని రోజులూ తెరుచుకోవచ్చు.
- హైదరాబాద్‌లో మాత్రం సరి, బేసి పద్ధతిలో షాపులు తెరుచుకోవచ్చు.
- సిటీ బస్సులు, రాష్ట్రాల మధ్య సర్వీసులు నడవవ్.
- రాష్ట్రంలో ఆర్టీసీ నడుస్తుంది.. హైదరాబాద్‌లో నడవదు.. సిటీ బస్సులు రెడ్ సిగ్నలే. నగరంలో మాత్రం ట్యాక్సీ, ఆటో, కార్లు నడుపుకోవచ్చు.
- రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ ప్రాంతాల్లో తప్ప సెలూన్లు తెరుచుకోవచ్చు
- ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ 100 శాతం తెరుచుకోవచ్చు. స్టాప్ మొత్తం అటెండ్ అవ్వచ్చు.
- పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా నిబంధనలను పాటిస్తూ ఎవరి పని వారు చేసుకోవచ్చు.
- ఈ కామర్స్ అన్నింటికీ అనుమతి ఉంటుంది. ఈ నిర్ణయంతో స్విగ్గీ, జొమాటో, అమెజాన్‌లకు భారీ ఊరటే.
- అన్ని మతాల యొక్క ప్రార్థనా మందిరాలు బంద్ ఉంటుంది. ఏవీ తెరుచుకోవడానికి వీల్లేదు. అదే విధంగా అన్ని మతాలకు సంబంధించిన ఉత్సవాలు కూడా బంద్ ఉంటాయి.
- ఫంక్షన్ హాల్స్, మాల్స్, సినిమా హాల్స్‌పై యథావిథిగా బంద్ కొనసాగనుంది.
- సభలు, ర్యాలీలు, సమావేశాలు 100 శాతం బంద్
- అన్ని రకాల విద్యా సంస్థలు బంద్‌లో ఉంటాయి. స్కూల్స్ కానీ కాలేజీలు, కోచింగ్ సెంటర్స్ కూడా తెరవడానికి వీల్లేదు.
- హోటల్స్, పబ్, క్లబ్, బార్లు, స్టేడియం, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులకు అనుమతి లేదు.
- మెట్రో సర్వీసులకు అనుమతి లేదు.
మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్!
‘ప్రతి ఒక్కరూ మాస్క్ కంపల్సరీగా ధరించాల్సిందే. మాస్క్ లేకుంటే వెయ్యి రూపాయిలు ఫైన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. ఇది మనందరి సమస్య కాబట్టి అందరూ గుర్తెట్టుకోవాలి. భౌతిక దూరం పాటించాల్సిందే. ఇది మనందరి కోసమే. ఎవరో వచ్చి ఆపాలే అనేది లేకుండా కచ్చితంగా అందరూ పాటించాల్సిందే. వ్యక్తిగత శానిటైజేషన్ తప్పనిసరి. షాపుల్లో శానిటైజేషన్ తప్పనిసరి. అలాగే రసాయనాలు పిచికారి చేయించుకోవాల్సిందే. షాపుల్లో వినియోగదారుల్లో కూడా నిబంధనలు పాటించాల్సిందే’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
వృద్ధులు, చిన్న పిల్లలను తిప్పొద్దు..!
‘వదిలారు కదా అని ప్రజలందరూ బయటికొచ్చి హంగామా చేయొద్దు. అవసరం ఉంటే తప్ప ఎవరూ బయటికి రావద్దు. నియంత్రణ, సంయమనం పాటించాల్సిందే. ఇది ఎవరికి వారే పాటించి తీరాల్సిందే. వృద్ధులు, చిన్న పిల్లలను బయటికి తిప్పొద్దు.. ఇంటికే పరిమితం చేయండి. ఇప్పటి వరకూ అన్ని నిబంధనలను ప్రజలు పాటించారు. రాష్ట్ర ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇన్ని రోజులు బాగా కంట్రోల్ చేసుకున్నాం.. అందరూ సహకరించారు. ఇలానే ఉంటే త్వరలోనే మనం కోలుకోవచ్చు. దయచేసి అందరూ స్వీయ నియంత్రణ పాటించి మనల్ని మనం కరోనా బారి నుంచి కాపాడుకుందాం’ అని కేసీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments