'రుద్రమదేవి'కి కేసీఆర్ వరం..

  • IndiaGlitz, [Thursday,October 08 2015]

తెలంగాణ వీర‌నారి రుద్ర‌మ‌దేవి చ‌రిత్ర ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌క నిర్మాత‌గా గుణ‌శేఖ‌ర్ నిర్మించిన భారీ చిత్రం 'రుద్ర‌మ‌దేవి'. దాదాపు డెబ్బై కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని గుణ‌శేఖ‌ర్ రూపొందించాడు. ఈ సినిమాలో అనుష్క‌, రానా, అల్లుఅర్జున్ త‌దిత‌రులు న‌టించారు. త్రీడీ టెక్నాల‌జీతో హిస్టారిక‌ల్ స్టీరియోస్కోపిక్ చిత్రంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా తీసినందుకు తెలంగాణ ప్రభుత్వం అప్ప‌ట్లో ఎంట‌ర్‌టైన్మెంట్ ట్యాక్స్(వినోద‌పు ప‌న్ను) తొలిగిస్తామ‌ని తెలియ‌జేసింది. ఇప్పుడు అన్న‌మాట‌ను నిల‌బెట్టుకుంది. కేసీఆర్ ట్యాక్స్ ను తొల‌గించారు.గుణ‌శేఖ‌ర్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆదివారంనాడు కేసీఆర్ రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని వీక్షిస్తార‌ని ఫిలింవ‌ర్గాల స‌మాచారం.

More News

మహేష్, మురుగుదాస్ మూవీ ఫిక్స్..

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నారు.

బ‌న్నికున్న‌ ట్రాక్ రికార్డ్ మారుతుందా?

'రుద్ర‌మ‌దేవి'.. ప్ర‌స్తుతం టాలీవుడ్ ఫోక‌స్ అంతా ఈ సినిమాపైనే. రేపు ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

తేజ హీరోయిన్ లపై విక్రమ్ కన్ను

దర్శకుడు తేజ రూపొందించే సినిమాలు సంచలనాలు సాధించినా..తుస్సుమన్నా..తను పరిచయం చేసే హీరోయిన్లకు మాత్రం మంచి భవిష్యత్తే ఉంటుంది.

బ‌న్ని, ఉద‌య్‌ బాట‌లో రాజ్ త‌రుణ్?

చిన్న‌వ‌య‌సులోనే క‌థానాయ‌కుడుగా త‌న‌కంటూ ఓ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు రాజ్ త‌రుణ్‌. 'ఉయ్యాల జంపాల‌', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న త‌రుణ్‌.

ర‌వితేజ టైటిల్ మార్పుకి కార‌ణం అదేనా?

'భ‌ద్ర'.. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం తెలుగు తెర‌పై కాసుల వ‌ర్షం కురిపించిన చిత్ర‌మిది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ సినిమాతోనే నేటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.