'ఓటుకు నోటు కేసు' లో కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చేశారుగా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి టైటిల్ చూడగానే.. కొంపదీసి ఏపీ సీఎం చంద్రబాబుకు గులాబీ బాస్ కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చేశారా..? ఏం గిఫ్ట్ ఇచ్చారబ్బా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అలాంటిదేమీ కాదు ఎవరి ఓటుకు అయితే నోట్ల కట్టలు వెదజల్లి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీపెన్సన్కు కేసీఆర్ మరోసారి నామినేటెడ్ సభ్యుడిగా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు మంత్రి వర్గ సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఇప్పటికే నామినేటెడ్గా ఎమ్మెల్యేగా ఉన్న స్టీపెన్సన్కు మరోసారి ఎమ్మెల్యేగా కొనసాగించాలని నిశితంగా చర్చించిన కేబినెట్.. గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. అయితే గవర్నర్ నరసింహన్ ఆమోదమే తరువాయి.
ఒకసారి గతంలోకి వెళితే..!
స్టీఫెన్సన్ అనే పేరు తెలుగు రాష్ట్రాలకే కాదు.. యావత్ భారతదేశానికి తెలిసిన పేరే. ఎందుకంటే ఓటుకు నోటు కేసు అంత పాపులర్ అయ్యింది గనుక అందరీకీ ఈ పేరు గుర్తుండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటేయాలని నోట్ల కట్టలతో వెళ్లిన అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అడ్డంగా దొరికిపోయింది. అంతేకాదు ఆ వ్యవహారంలో " యా బ్రదర్ మనవాళ్లు బ్రీఫ్డ్ మీ బ్రదర్" అంటూ కర్త, కర్మ, క్రియగా.. చంద్రబాబు మిగిలిపోయారు. బహుశా చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఈ కేసు మరుపురాని మచ్చగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. రేవంత్ రెడ్డి బుక్కవ్వడం.. బాబు ఆడియో టేపుల తర్వాత జరిగిన పరిణామాలు ఇక్కడ అప్రస్తుతం.
నమ్మకానికే పట్టం కట్టిన కేసీఆర్!
కాగా.. ఆంగ్లో ఇండియన్ అయిన స్టీపెన్సన్ టీడీపీ ఇవ్వజూపిన భారీ మొత్తం డబ్బులకు లొంగిపోకుండా.. ఆయన్ను సంప్రదించినప్పుడే అధిష్టానానికి సమాచారం తెలియజేసి రెడ్ హ్యాండెడ్గా పట్టించి నిజాయితీ చాటుకున్నారు. దీంతో అప్పట్నుంచి కేసీఆర్ మనసులో స్టీపెన్సన్కు స్థానం ఉండిపోయింది. అందుకే మరోసారి ఆ నమ్మకానికే అవకాశం ఇస్తున్నారని అవసరైతే ఏదైనా పదవి కూడా ఇస్తారని టాక్ నడుస్తోంది. పాపం ఇంకా ఐదేళ్లు స్టీపెన్సన్ పేరు వినపడినప్పుడల్లా టీడీపీకి టక్కున ఓటుకు నోటు కేసు గుర్తొస్తూనే ఉంటుందేమో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout