ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసిన కేసీఆర్

  • IndiaGlitz, [Sunday,September 27 2020]

ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. విజయదశమిని రోజు ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమవుతుందని నమ్మకం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లనూ దసరా లోపుగానే పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. అధికారులకు డెమో ట్రయల్స్ ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి మండలానికి ఒకరు చొప్పున, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియోమకాన్ని పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సీఎం తెలిపారు.

నిర్ధారించిన రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. తహశీల్దారు కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్‌లో ఎంటర్ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటవెంటనే నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తునందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని కేసీఆర్ స్పష్టం చేశారు

More News

నాగ్ మెడల్స్.. గంగవ్వకు మహానటి.. అవినాష్‌కు కంత్రి

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యానికి గ్రేట్ ట్రిబ్యూట్ అర్పించిన అనంతరం షో స్టార్ట్ అయింది. శుక్రవారం జరిగింది చూసిన అనంతరం నాగ్..

బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి డీకే అరుణ, పురందేశ్వరి..

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని జేపీ నడ్డా ప్రకటించారు. జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇరువురు మహిళా నేతలు స్థానం దక్కించుకోవడం విశేషం.

బిగ్‌బాస్ 4 .. ఈ వారం ఎలిమినేట‌ర్ ఎవ‌రంటే..?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4లో మూడో ఎలిమినేష‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ఎలిమినేష‌న్స్ జ‌రిగాయి.

అభిమాని చెప్పులు తాకిన స్టార్ హీరో..!

హీరోలంటే సాధార‌ణ ప్రేక్ష‌కుల్లో ఓ క్రేజ్ ఉంటుంద‌నండంలో సందేహం లేదు. ఇక అగ్ర హీరోల గురించి, వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

నేష‌న‌ల్ మీడియాపై హ‌రీశ్ శంక‌ర్ సెటైర్ !

టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ నేష‌న‌ల్ మీడియాపై త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు.