దుర్మార్గం.. ఈ సమయమే దొరికిందా?: కేసీఆర్ ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు నయా దందాలకు తెరదీసిన విషయం తెలిసిందే. పేద, గొప్ప తేడా లేకుండా దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. కరోనా ట్రీట్‌మెంట్ పేరుతో కొన్ని హాస్పిటల్స్ డబ్బులు దండుకుంటున్నాయన్నారు. ఇది దుర్మార్గమని మండిపడ్డారు.
వాడు ఎవడైనా కానీ.. ఏ ఆసుపత్రి అయినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లోకం అల్లాడుతుంటే.. ఈ సమయమే దొరికిందా? అంటూ కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ఇచ్చిన సలహాను పాటిస్తామన్నారు. తాము నియమించబోయే టాస్క్‌ఫోర్స్ కమిటి ఆరోగ్యమంత్రి పర్యవేక్షణలో ఉంటుందన్నారు. వారానికి ఓసారి రిపోర్ట్ అన్ని పార్టీలకు అందేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
రెవెన్యూ డిపార్ట్‌మెంట్ గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసేందుకే నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లులు సభల ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం సభలో మాట్లాడారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని హామీ ఇచ్చారు. వారి స్థాయికి తగిన ఉద్యోగాల్లో వారిని నియమిస్తామన్నారు. పీవీ, ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కొన్ని మార్పులు జరిగాయని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే శాశ్వత పరిష్కారమైతే చూపించలేకపోయారన్నారు. అవినీతి రహిత సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout