కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి.. కవిత పరిస్థితేంటి..!?
Send us your feedback to audioarticles@vaarta.com
కల్వకుంట్ల కవిత విషయంలో కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో ఘోరంగా ఓడిపోయిన కవితకు పార్టీలో ఆయనిచ్చే ప్రాధాన్యమేంటి..? పదవేంటి..? ఇంతకీ ఆమెకు పదవి ఇస్తారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనేది తెలియట్లేదు. ఒక్కోసారి అసలు కవిత ఇక రాజకీయాలకు దూరమైపోయినట్లేనా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయ్.!. హరీశ్ శాఖ.. కవితకు రానుందా..? ఇంతకీ కేసీఆర్ మదిలో ఏముందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఎలా సాధ్యం..!
కల్వకుంట్ల కవిత మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారని.. ఇక ఢిల్లీ వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయ్. అంతేకాదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే రానున్న ఎన్నికల్లో ఢిల్లీ వేదికగా ఆమె చక్రం తిప్పుతారని కూడా వార్తలు వచ్చాయ్. అయితే కవిత ఢిల్లీలో చక్రం తిప్పాలంటే లోక్సభ లేదా రాజ్యసభ సభ్యురాలై ఉండాలి. అయితే నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత ఘోరంగా ఓడిపోయారు. ఇక మిగిలింది రాజ్యసభ మాత్రమే.. ఉన్న రెండు స్థానాల్లో అసలు ఎవరిని పెద్దల సభకు పంపాలో తీవ్ర ఉత్కంఠ మధ్య ఫైనల్గా మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, కేసీఆర్కు ఆప్తుడైన కేకే (కేశవరావ్)ల పేర్లను గురువారం సాయంత్రంతో అధికారికంగా ప్రకటించేశారు. అంటే టికెట్ ఆశించిన వారికి కేసీఆర్.. ఊహించని షాకే ఇచ్చారు. అంటే కవిత ఢిల్లీకి వెళ్లట్లేదన్న మాట. ఇక చక్రం తిప్పడం ఎలా సాధ్యమో.
హరీశ్ శాఖ కవితకు!
ఇదిలా ఉంటే.. ఇలా రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన అనంతరం మరో పుకారు షికారు చేస్తోంది. అదేమిటంటే... కవితకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తెలంగాణ కేబినెట్లో స్థానం కలిపించబోతున్నారట. ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని నడిచాయ్. కవితకు ఓ కీలక శాఖ అప్పగించాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట. అది కూడా గత కేబినెట్లో హరీశ్ శాఖ అయిన భారీ నీటిపారుదల శాఖ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ప్రస్తుత కేబినెట్లో హరీశ్.. ఆర్థిక మంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది..? అయితే ఆశావహులు కూడా చాలా మందే ఉన్నారు. ఈసారి కవితకు ఈ పదవి ఇవ్వకపోతే.. రాజకీయాల్లో మసలడం కష్టమే.. జనాలు కూడా ఆమెను మరిచిపోతారేమో.. మరి కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉందో..? కవితను కీలక పదవి వరించనుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com