తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు..: కేసీఆర్

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

తెలంగాణలో ఏప్రిల్-30 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు ఉంటుందని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శనివారం నాడు సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చారాయన. ప్రజలందరూ దయచేసి సహకరించాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. ఏప్రిల్-30 తర్వాత దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని మరోసారి కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగించాలనే కోరారు. కాగా.. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నామని.. పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.

కేసుల లెక్క ఇదీ..

‘మనకు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు  34 మంది.. వాళ్లు, వాళ్ల ద్వారా సంక్రమించిన మరికొంతమంది వందశాతం డిశ్చార్జ్ అయ్యారు. తొలి దశలో వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది చనిపోగా.. 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 393 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మర్కజ్‌ నుంచి వచ్చిన 1200 మందిని గుర్తించాం’ అని కేసీఆర్ తెలిపారు.

భగవంతుని దయవల్ల..

‘ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ సిరియస్‌గా లేదు. ఆక్సిజన్, వెంటిలేటర్ పెట్టే పరిస్థితి లేదు. భగవంతుని దయవల్ల ఏప్రిల్-24 వరకు ఈ బ్యాచ్ క్లోజ్ అయ్యే ఆస్కారం ఉంది. ఆస్పత్రుల్లో ఉండేవాళ్లు.. క్వారంటైన్ వాళ్లు అందరూ రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఉప్పెన, ఉత్పాతం రాకపోతే చాలా వరకు మనం బయటపడినవాళ్లం అవుతాం. వ్యాధి ప్రబలకుండా నిరోధించే చర్యలు ప్రజలు సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లో 243 చోట్ల నిరోధించే చర్యలు చేపట్టాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

 
 

More News

చిరు లేడీ ఫ్యాన్‌కు హార్ట్ సర్జరీ సక్సెస్.. ధన్యవాదాలు

గుంటూరు జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ’ అధ్యక్షురాలు, చిరు వీరాభిమాని కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి

చైనాలో కరోనా వ్యాప్తి కట్టడికి రంగంలోకి రోబోలు!

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా మమమ్మారి ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే 200 పైచిలుకు దేశాలు దాటేసిన ఈ వైరస్‌తో ఇటలీ, స్పెయిన్,

చేతులెత్తి దండం పెడుతున్నా.. భారత్ సాయం కావాలి!

కరోనా మహమ్మారితో మన దాయాది దేశం పాకిస్థాన్ విలవిలలాడుతోంది. మొత్తం సుమారు 5వేలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 77 మంది మృతి చెందారు.

ఇండియాపై న్యూయార్క్ స్వాతి వీడియో.. నెట్టింట్లో వైరల్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి.

మరో 2వారాల పాటు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రధాని అంగీకారం!?

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్-14తో లాక్‌డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.