ఆర్టీసీపై కేసీఆర్ కన్నెర్రజేస్తారా.. కరుణిస్తారా!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై కేసీఆర్ సర్కార్ ఇవాళ తేల్చనుంది. బేషరతుగా తమ డిమాండ్లను పక్కన పెట్టి విధుల్లో చేరతామని.. ఆర్టీసీని ప్రభుత్వం ఆదర్శ సంస్థగా గుర్తించాలని జేఏసీ కోరిన విషయం విదితమే. అయితే ఇవాళ సాయంత్రం ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గడంతో కేసీఆర్ ఏం చేయబోతున్నారు..? కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలా..? వద్దా..? ఒకవేళ చేర్చుకుంటే షరతులు విధించాలా? అవి ఎలా ఉండాలి? అనే దానిపై ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అధికారులతో నిశితంగా సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. షరతులు విధిస్తే మాత్రం సమ్మె విరమణపై పునరాలోచించుకుంటామని ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో కార్మికులపై కేసీఆర్ కరుణ చూపుతారా? కన్నెర్ర చేస్తారా? అన్నది గురువారం సాయంత్రం తేలిపోనుంది.
వెనక్కి పంపుతున్న డిపో మేనేజర్లు!
ఇదిలా ఉంచితే.. సమ్మె విరమణ అనంతరం పలువురు ఉద్యోగులు విధుల్లో చేరడానికి వెళ్లగా వారికి ఊహించని షాక్ ఎదురవుతోంది. ఇవాళ వరంగల్‌లో జిల్లాలో విధుల్లో చేరేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికుల్ని.. వారిని చేర్చుకోకుండా వెనక్కిపంపుతున్నారు. మిమ్మల్ని విధుల్లో చేర్చుకునే విషయమై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని కార్మికులు పంపించేస్తున్నారు. అయితే ఇవాళ సాయాంత్రం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..? అనేదానిపై ఆర్టీసీ కార్మికులునరన సర్వత్రా ఆసక్తికర చ్యచసాగుతోంది. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారో తెలియాలంటే ఇవాళ సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments