ఆర్టీసీపై తేల్చేసిన కేసీఆర్.. సింగిల్ సంతకంతో...!!

  • IndiaGlitz, [Thursday,October 24 2019]

ఆర్టీసీ మునగక తప్పదని.. దాన్ని ఎవరూ కాపాడలేరని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై ఫస్ట్ టైమ్ కేసీఆర్ స్పందించారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా అని వ్యాఖ్యానించారు. ‘అసంబధమైన, అర్థంపర్థం లేని డిమాండ్‌లు చేస్తున్నారు. 44 శాతం జీతాలు పెంచి బాగా పనిచేయమని చెప్పాను. నాలుగేళ్ల కాలంలో 67 వాతం కార్మికులు జీతాలు పెంచాం. ఇంత చేసినా గొంతెమ్మ కోర్కెలు కోరడటం అర్థం ఉంటుందా..?. పనికిమాలిన 20 డిమాండ్లను ప్రభుత్వం ముందుపెట్టారు. స్పందించి మేం కమిటీ కూడా వేశం. ఆర్టీసీని ఎవరూ కాపడలేరు. ప్రభుత్వం మారినప్పుడల్లా సమ్మె చేస్తే ఎలా..?. యూనియన్ ఎన్నికల కోసమే ఈ సమ్మెలు చేస్తున్నారు. ఇది చిల్లర రాజకీయ యూనియన్ల సమ్మె.

మిమ్మల్ని చేస్తే వాళ్ల పరిస్థితేంటి!?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఒప్పుకుంటే.. మరో 57 కార్పోరేషన్లు కూడా మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయమని డిమాండ్ చేస్తాయి. గత ప్రభుత్వాలు ఇవ్వనంతగా ఆర్టీసీ కార్మికులకు మేం ప్రోత్సహకాలు ఇచ్చాం. 67శాతం జీతాలు ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు. ఆర్టీసీని యూనియన్లే ముంచాయని.. కార్మికులను తప్పుదోవ పట్టించి వాళ్లను సమ్మె బాట పట్టించారు. ఇప్పుడు ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంది. జీతాలు ఇవ్వడానికి కూడా ఆ సంస్థ దగ్గర డబ్బు లేదు. ఇప్పటిదాకా ఆర్టీసీకి ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.900కోట్లు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బు కూడా లేదు. ఆర్టీసీ ఒక్కటే మా ప్రాధాన్యం కాదని.. మిగతా కార్పోరేషన్లను కూడా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఒక్క సంతకంతో..!

‘ప్రస్తుతం ఆర్టీసీలో 2600 బస్సులను మార్చాల్సిన అవసరం ఉంది. జీతాలకే డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఆర్టీసీ ఇప్పుడు వాటిని మార్చడం అసంభవం. లేబర్ కోర్టును ఆశ్రయిస్తే చివరకు ఆర్టీసీ ఆస్తులు అమ్మి వారికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. యూనియన్లు అనసవరంగా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. ఆర్టీసీ ముగింపే.. దీనిపై ఐదారు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఒక్క కేబినెట్ సమావేశంతో.. ఒక్క సంతకంతో.. రాష్ట్రంలో 7వేల బస్సులకు పర్మిట్స్ ఇస్తాము. ఆర్టీసీ కంటే తక్కువ చార్జిలకే ప్రజలకు రవాణా అందుబాటులోకి వస్తుంది’ అని కేసీఆర్ తేల్చి చెప్పేశారు.

More News

హుజూర్‌నగర్‌లో ‘కారు’ గెలుపు ఆషామాషీ కాదు!

తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

నాని నిర్మాణంలో విశ్వ‌క్ సేన్ హీరోగా ప్రారంభ‌మైన `హిట్‌`

హీరోగా ప‌లు వైవిధ్య‌మైన చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించి త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నేచుర‌ల్ స్టార్ నాని. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క్ర‌మంలో..

న‌రేష్ వివ‌ర‌ణ‌..జీవిత ఘాటు స్పంద‌న‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) వివాదం రోజు రోజుకు పెరుగుతూ వ‌స్తుంది. రీసెంట్‌గా జ‌రిగిన ప్రెస్‌మీట్ అనంత‌రం ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తామ‌ని

సీఎం కావాలని పగటి కలలు కనట్లేదు: పవన్

‘నేను ముఖ్యమంత్రి అవ్వాలని పగటి కలలు కనడం లేదు. 25 ఏళ్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పార్టీని పెట్టాను.

బ్రేకింగ్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాలీవుడ్ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ని బెదిరించిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు.