లాక్డౌన్ సడలింపుల్లేవ్.. మే-01 తర్వాత ఊరట : కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్-20 నుంచి లాక్ డౌన్ సడలింపులు ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం అలాంటి సడలింపులు ఏమీ ఉండవని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పేశారు. ఆదివారం నాడు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘42 దేశాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. మే-03 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది. రేపట్నుంచి కొన్ని సడలింపులు ఉంటాయని కేంద్రం చెప్పింది కానీ.. తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సడలింపులు ఉండవ్. ఇవాళ నిశితంగా కేబినెట్ భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంది. గతంలో ఉన్న నిబంధనలే యథాతథంగా అమలులో ఉంటాయి. నిత్యవసరాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
మే-01 నుంచి..
‘మే-01 కరోనా నుంచి తెలంగాణ కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయ్ అని ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ 18 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ్టి కేసులతో కలిపితే మొత్తం 858 కేసులు. ఇందులో 21 మరణాలు సంభవించాయి. 186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సలో 651 వైద్యం తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదు.. నార్మల్గానే ఉంది. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, భువనగిరి, సిద్ధిపేట ఈ నాలుగు జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్. దేశంలో 8 రోజులకోసారి కేసులు రెట్టింపు అవుతున్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి 10 రోజులు పెడుతుంది’ అని కేసీఆర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout